Share News

నా ఆస్తులపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:41 PM

కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారు మినహా.. రాష్ట్ర ప్రజలు దీనిని దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు.

నా ఆస్తులపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు
Ambati Rambabu

గుంటూరు జిల్లా, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారు మినహా.. రాష్ట్ర ప్రజలు దీనిని దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు. తన ఆస్తులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనకు సత్తెనపల్లిలో 22 ఎకరాల పొలం ఉందని.. ఆ పొలానికి కూడా సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారని ప్రస్తావించారు. ఇవాళ(బుధవారం) గుంటూరు వేదికగా మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడారు.


తన పొలాన్ని సర్వే చేయాలని ఎమ్మార్వో కార్యాలయం నుంచి తనకు నోటీసులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ తనిఖీ చేయమని చెప్పారని వారు తనకు చెప్పారన్నారు. తన పొలంలో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ ఉందని.. సర్వే చేయాలని అధికారులు చెబుతున్నారని అన్నారు.


నా ఆస్తుల మీద పడ్డారు..

వారు తన ఆస్తుల మీద పడ్డారని... తాను లీగల్‌గా కొన్న స్థలమని చెప్పుకొచ్చారు. తాను వేరే వారి నుంచి పొలం కొనుక్కునే ముందే అందులో చిన్న బావి, పెంకుటిల్లు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదన్నారు. తన దగ్గర దాపరికాలు ఏమి ఉండవని.. చంద్రబాబు, లోకేశ్ తన పొలం చూస్తాను అంటే రావాలని అన్నారు. తనను భయపెట్టాలని వారు అనుకుంటున్నారని.. రేపు గుంటూరులో తమ ఇంటికి కూడా నోటీసులు ఇస్తారేమోనని అంబటి రాంబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 01:43 PM