Share News

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:54 PM

ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ బిల్లు-2026ని శాసన మండలి ఆమోదించింది.

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..
AP Legislative Council

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ బిల్లు-2026ని శాసన మండలి ఆమోదించింది. అగ్నిమాపక వ్యవస్థను ఆధునికీకరణ చేసి మరింత బలోపేతం చేయడం కోసం చట్ట సవరణ చేసింది. అగ్నిమాపక వ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తూ చట్ట సవరణకు శాసన మండలి ఆమోదం తెలిపింది.


అగ్నిప్రమాదాల విషయంలో నిర్లక్ష్యం వహించిన యజమానులపై కఠిన జరిమానా విధిస్తామని శాసన మండలి హెచ్చరించింది. ఈ బిల్లులో లోపాలను సవరిస్తూ చట్ట సవరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ జన విశ్వాస్ సవరణ బిల్లు 2006-కు శాసన మండలి ఆమోదం తెలిపింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సవరణలు చేస్తూ చట్టసవరణకు ఆమోదించింది. వాడుకలో ఉన్న కొన్ని చట్టాలు రద్దు చేసి కొత్త చట్టంలో సవరణలు చేస్తూ శాసన మండలి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

అంగన్‌వాడీ సమస్యలపై అసెంబ్లీలో చర్చ

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 01:59 PM