Share News

లిక్కర్ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్

ABN , Publish Date - Mar 06 , 2026 | 07:40 PM

ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పలువురి నిందితుల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.

లిక్కర్ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్

అమరావతి, మార్చి 06: ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పలువురి నిందితుల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యలకు సంబంధించిన రూ.441 కోట్ల ఆస్తులను శుక్రవారం అటాచ్ చేసింది ఈడీ. ఈ మొత్తంలో స్థిర, చరాస్తులు ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా రూ.104 కోట్లు వీరు కొల్లగొట్టారంటూ ఈడీ వివరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


అటాచ్ చేసిన జాబితాలో బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, భూములు ఉన్నాయి. ఇక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బూనేటి చాణక్యకి సంబంధించిన సంస్థల ఆస్తులను అటాచ్ చేసింది. దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థల ఆస్తులను అటాచ్ చేశారు.


అలాగే మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. PMLA (Prevention of Money Laundering Act) 2002 కింద తాత్కాలికంగా ఈ ఆస్తులను అటాచ్‌ చేసింది. హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకుంది.

Updated Date - Mar 06 , 2026 | 09:31 PM