Share News

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం

ABN , Publish Date - Mar 06 , 2026 | 08:33 PM

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకం
Errabelli Swarna News

హైదరాబాద్, మార్చి 06: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC) శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రబెల్లి స్వర్ణకు వరంగల్ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు.


2002లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైన ఆమె, నగరానికి మొట్టమొదటి మహిళా మేయర్ గా సేవలందించి నగరాభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉండటం వల్ల అధిష్ఠానం ఆమెపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి స్వర్ణ నియామకం పట్ల జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు ఫిర్యాదు

సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

For More TG News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 09:43 PM