Share News

వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు మరోసారి అస్వస్థత

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:43 PM

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఏపీ శాసనమండలిలో మాట్లాడుతున్న సమయంలోనే ఆయన స్వల్పంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స అందజేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు మరోసారి అస్వస్థత
Botsa Satyanarayana

అమరావతి, మార్చి 6: ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఇబ్బంది పడుతున్న బొత్స.. మండలిలో మాట్లాడుతుండగా కింద పడబోయారు. దీంతో వెంటనే అసెంబ్లీ అధికార వర్గాలు అత్యవసరంగా వైద్యులను పిలిపించి, ఆయన ఛాంబర్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. బీపీలో హెచ్చుతగ్గులు, సరైన సమయానికి భోజనం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వివరించారు. విశ్రాంతి తీసుకోవాలని, అవసరమైతే మరిన్ని వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు.


అలాగే, బొత్సతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బొత్స సత్యనారాయణ హైబీపీతో ఇబ్బంది పడుతున్నారని, బీపీ కంట్రోల్‌లోకి రాకపోతే హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. దీంతో బొత్సను సహచరులు ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.


ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆత్మీయ సమావేశం...హాజరుకానున్న సీఎం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 04:44 PM