ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:25 PM
ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 16వ శాసనసభ ఐదో సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
అమరావతి, మార్చి 6: ఏపీ శాసనసభ సమావేశాలు(AP Legislative Assembly) నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. 16వ శాసనసభ ఐదో సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయన్నారు. 72 గంటల 14 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. మొత్తం 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని... 80 ప్రశ్నలకు సభాసమక్షంలో ఉంచారని చెప్పారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఒక లఘు చర్చ, 344వ నియమం కింద చర్చించిన అంశాలు ఒకటి అని వివరించారు. శాసనసభలో టీడీపీ- 135, జనసేన-21, వైసీపీ-11, బీజేపీ-8 మంది సభ్యులున్నారని స్పీకర్ తెలిపారు.
ఈరోజు సాయంత్రం సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా రావాలని స్పీకర్ కోరారు. క్రీడాపోటీల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. 166 పాఠశాలల నుంచి 6,693 విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారని.. అసెంబ్లీకి ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఎప్పుడూ రాలేదని స్పీకర్ అన్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్‌పై సీఎం కీలక ప్రకటన
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
Read Latest AP News And Telugu News