11 మంది ఉన్నా 1100 మంది లాగా మాట్లాడుతున్నారు.. వైసీపీపై పవన్ కల్యాణ్ సెటైర్లు
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:38 PM
వైసీపీకి 11మంది సభ్యులున్నా 11వందల మంది ఉన్నట్లుగా మాట్లాడుతారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చెప్పే అసత్యాలు కూడా ప్రజలు నిజాలని బలంగా నమ్మే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి 11మంది సభ్యులున్నా 11వందల మంది ఉన్నట్లుగా మాట్లాడుతారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు చెప్పే అసత్యాలు కూడా ప్రజలు నిజాలని బలంగా నమ్మే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించటం తమ హక్కని వైసీపీ భావిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అసభ్య పదజాలంతో మాట్లాడే వారిని కట్టడి చేయాలని కోరారు. దోపిడి చేసే దొంగ పోలీసులను చూసి.. దొంగే దొంగ అని అరిచినట్లుగా జగన్ అండ్ కో తీరు ఉందని సెటైర్లు గుప్పించారు. ద్రవ్యవినిమయ బిల్లుపై పవన్ కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడారు.
కల్తీ వాళ్లే చేస్తారు..
కల్తీ వాళ్లే చేస్తారని... నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై మోపుతారని పవన్ కల్యాణ్ ఆగ్రహించారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా.. అన్ని కులాల వాళ్లు ఓట్లు వేయాల్సిందేనని తెలిపారు. ఈ మధ్య కొందరు ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టి కులం వెనుక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కులం దాటకపోతే ఏపీ విచ్చిన్నమవుతుందని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా మనమే చెప్పాలని అన్నారు. లేకపోతే ఎంత బడ్జెట్ పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పుకొచ్చారు. పోలవరం, అమరావతిని వైసీపీ పక్కన పెట్టిందని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రంప్‌నకు ఊరట.. యుద్ధ చర్యల నియంత్రణపై డెమోక్రాట్ల ప్రయత్నం విఫలం
కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన
Read Latest International News And Telangana News And AP News And Telugu News