ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం...హాజరుకానున్న సీఎం
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:26 PM
విజయవాడలో ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
విజయవాడ, మార్చి 6: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం ఈరోజు సాయంత్రం జరగనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6:00 గంటలకు విజయవాడ పటమట డొంక రోడ్డులోని ఆంత్రా లక్స్ ఫంక్షన్ హాల్‌లో(ANTRA LUXE FUNCTION HALL) ఈ కార్యక్రమం జరగనుందని... ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని చెప్పారు. కార్యక్రమంలో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం క్రీడల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నారని మంత్రి వివరించారు. తరువాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర సభ్యులతో కలిసి విందులో పాల్గొననున్నారని చెప్పారు. సభ్యులందరూ సాయంత్రం 6:00 గంటలకు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్
Read Latest AP News And Telugu News