Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 30 , 2026 | 06:50 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 30, 2026 21:54 IST

    ముడిచమురు ధరల తగ్గింపు నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

    • ఇంధన ఎగుమతులపై అదనపు ఎక్సైజ్‌ సుంకాల సవరణ

    • లీటర్‌ పెట్రోల్‌పై రూ.4, డీజిల్‌పై రూ.8.50 అదనపు సుంకం

    • ATF ఎగుమతులపై లీటర్‌కు రూ.7.50 అదనపు సుంకం

    • రేపటి నుంచి అమల్లోకి చమురు నూతన పన్ను రేట్లు

  • Jun 30, 2026 21:44 IST

    యాదగిరిగట్ట ఆలయ కొత్త పాలకమండలి నియామకం

    • యాదగిరిగుట్ట బోర్డు చైర్మన్‌గా MSN ఫార్మా అధినేత సత్యనారాయణరెడ్డి నియామకం

    • మొత్తం 18 మంది సభ్యులతో నూతన పాలకమండలి

    • మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖకు బోర్డులో చోటు

  • Jun 30, 2026 21:24 IST

    టీడీపీ కార్యకర్తకు.. సీఎం చంద్రబాబు పరామర్శ

    • అమరావతి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీడీపీ కార్యకర్త

    • కార్యకర్తకు ఫోన్‌లో సీఎం చంద్రబాబు పరామర్శ

    • ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

  • Jun 30, 2026 21:10 IST

    కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ సమావేశం

    • పరిపాలనా సంస్కరణలపై విస్తృత చర్చ

    • ఆత్మనిర్భర్ భారత్‌ను బలోపేతం చేయాలని దిశానిర్దేశం

    • మెరుగైన ప్రణాళికలు, నిర్ణయాల కోసం 'PM గతిశక్తి' వేదికను విస్తృతంగా ఉపయోగించాలి: ప్రధాని మోదీ

  • Jun 30, 2026 21:04 IST

    POKలో కొనసాగుతున్న ఆందోళనలు

    • రావల్‌కోట్‌లో ఆందోళనకారుల నిరసన

    • POKలో పాక్‌ భాగమే కాదు: నిరసనకారులు

    • మాకు పాక్‌ అవసరమే లేదు: నిరసనకారులు

    పూర్తి కథనం..

  • Jun 30, 2026 20:45 IST

    అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు చుక్కెదురు

    • బర్త్‌ రైట్‌ సిటిజన్‌షిప్‌ ఉండాల్సిందేనన్న సుప్రీం

    • చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించిన ట్రంప్‌

    • ఇప్పటికే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేసిన ట్రంప్‌

    • ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సుప్రీం కోర్టు

    పూర్తి కథనం..

  • Jun 30, 2026 20:18 IST

    అసెంబ్లీలోనే కాదు.. ఎక్కడైనా చర్చకు సిద్ధం: మాజీ మంత్రి హరీశ్ రావు

    • రైతులను ఎవరు మోసం చేశారో చర్చిద్దాం: మాజీ మంత్రి హరీశ్ రావు

    • రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు

    • చేతగాని మాటలు.. చెత్త వాగుడు తప్ప ఏమీలేదు: మాజీ మంత్రి హరీశ్ రావు

  • Jun 30, 2026 19:58 IST

    రేపు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో ప్రజావేదిక కార్యక్రమం

    • లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

  • Jun 30, 2026 19:58 IST

    అమరావతి: పారిశుద్ధ్య సేవలను నిర్లక్ష్యం చేస్తే సహించం: మంత్రి సత్యకుమార్‌

    • ప్రభుత్వ వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాలి: మంత్రి సత్యకుమార్‌

    • సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సత్యకుమార్

  • Jun 30, 2026 19:57 IST

    తెలంగాణ నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పులి

    • కుక్కునూరు మండలం సిద్దారం దగ్గర పులి సంచారం

    • జియో ట్రాకింగ్ ద్వారా గుర్తించిన అటవీశాఖ అధికారులు

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికల జారీ

  • Jun 30, 2026 19:56 IST

    అమరావతిలో సింగపూర్ బృందం పర్యటన

    • అమరావతి ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ బృందానికి వివరించిన CRDA అధికారులు

  • Jun 30, 2026 19:56 IST

    నెల్లూరు: తాటిపర్తిలో ఎరువు దుకాణాలపై విజిలెన్స్ దాడులు

    • పలు దుకాణాల ఎరువుల స్టాక్‌ రిజిస్టర్లలో వ్యత్యాసాల గుర్తింపు

    • రూ.18.97 లక్షల విలువైన ఎరువుల సీజ్‌, కేసులు నమోదు

  • Jun 30, 2026 18:59 IST

    హైదరాబాద్: రైతు భరోసా నిధులు విడుదల

    • నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    • తొలివిడత 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు జమ

    • 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు లబ్ధి

    పూర్తి కథనం..

  • Jun 30, 2026 18:26 IST

    పంటల సాగుకు భరోసా కోసమే రైతు భరోసా నిధులు: మల్లు భట్టి విక్రమార్క

    • ప్రతి పంటనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది: భట్టి

    • కట్టుకథలతో కేటీఆర్‌, హరీష్‌రావు దుష్ప్రచారం: భట్టి

    • BRS పాలనలో తెలంగాణను తాకట్టుపెట్టారు: భట్టి

    • కేసీఆర్‌ హయాంలో రైతులకు ఒరిగిందేమీ లేదు: మల్లు భట్టి విక్రమార్క

  • Jun 30, 2026 18:26 IST

    తెలంగాణను గత పాలకులు విధ్వంసం చేశారు: మంత్రి తుమ్మల

    • ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం: మంత్రి తుమ్మల

    • తొలి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేశాం: మంత్రి తుమ్మల

    • BRS పాలనలో రూ.లక్ష రుణమాఫీ ప్రకటించినా అమలుచేయలేదు: మంత్రి తుమ్మల

    • గత BRS ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు: మంత్రి తుమ్మల

  • Jun 30, 2026 17:19 IST

    ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య: మంత్రి లోకేశ్

    • నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికీ చేరాలి: మంత్రి లోకేశ్

    • విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

    • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం: మంత్రి లోకేశ్

    పూర్తి కథనం..

  • Jun 30, 2026 17:18 IST

    శ్రీకాకుళం: పోలీసుల విచారణకు డుమ్మాకొట్టిన YCP MLC దువ్వాడ

    • అనారోగ్య సమస్యతో విచారణకు రావడం లేదని లాయర్‌ ద్వారా దువ్వాడ సమాచారం

    • ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి దువ్వాడ

    • గతంలో చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడకు నోటీసులు

  • Jun 30, 2026 17:07 IST

    విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసుపై కోర్టు విచారణ

    • సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌

    • మరింత సమాచారం కోసం సీఐ నాగరాజు కస్టడీ అవసరం: పీపీ

    • ఉద్దేశపూర్వకంగానే కస్టడీ కోరుతున్నారు: నాగరాజు తరఫు లాయర్

    • ఇప్పటికే సిట్‌కు పూర్తి సమాచారం ఇచ్చారు: నాగరాజు లాయర్

  • Jun 30, 2026 16:38 IST

    హైదరాబాద్‌: ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి: ఆర్‌.కృష్ణయ్య

    • జీఓ నెంబర్‌ 9ని రద్దు చేయాలి: ఆర్‌.కృష్ణయ్య

    • ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం చేస్తాం: ఆర్‌.కృష్ణయ్య

    • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేయాలని చూస్తున్నారు: ఆర్‌.కృష్ణయ్య

  • Jun 30, 2026 16:38 IST

    కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

    • CBDT చైర్మన్‌ రవి అగర్వాల్‌ పదవీకాలం 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు

    • నేటితో ముగియాల్సిన రవి అగర్వాల్‌ పదవీకాలం పొడిగింపు

  • Jun 30, 2026 16:37 IST

    ఢిల్లీలో ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభం

    • SIR ప్రక్రియలో 13 వేల మంది అధికారులు

    • నెల రోజుల పాటు కొనసాగనున్న ఓటర్ల గణన

    • ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు అభ్యంతరాల స్వీకరణ

    • అక్టోబర్‌ 7న ఢిల్లీ ఓటర్ల తుది జాబితా విడుదల

  • Jun 30, 2026 16:37 IST

    ఈగల్ ఫోర్స్, కొత్తగూడెం పోలీసుల సంయుక్త ఆపరేషన్

    • సారపాక ఐటీసీ గేట్‌ దగ్గర పోలీసుల తనిఖీలు

    • లారీలో తరలిస్తున్న 525 కేజీల గంజాయి సీజ్‌, ముగ్గురి అరెస్ట్

  • Jun 30, 2026 16:30 IST

    తెలంగాణ సచివాలయ ముట్టడికి రెడ్డి సంఘం నేతల యత్నం

    • రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

    • రెడ్డి సంఘం నేతలను అడ్డుకుని, అరెస్టు చేసిన పోలీసులు

  • Jun 30, 2026 16:15 IST

    వెనెజువెలా జంట భూకంపాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

    • 58 వేలకుపైగా భవనాలు ధ్వంసమైనట్లు నాసా అంచనా

  • Jun 30, 2026 16:00 IST

    అమరావతి: ముగిసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విచారణ

    • హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యల అంశంపై విచారణ

    • అమర్నాథ్‌ను గంటపాటు ప్రశ్నించిన మహిళా కమిషన్‌

    • కమిషన్‌ ఎదుట తన వాదనలు వినిపించిన అమర్నాథ్‌

  • Jun 30, 2026 15:40 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 250 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 80 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 30, 2026 15:37 IST

    హైదరాబాద్‌: HDFC CSR నిధులతో అభివృద్ధి పనులు

    • రెండు అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం రేవంత్

    • భూపాలపల్లి ఆస్పత్రిలో MRI మిషన్‌ ప్రారంభం

  • Jun 30, 2026 15:18 IST

    విశాఖ: కేంద్రీయ గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం

    • ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • 13 మందికి బంగారు పతకాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

    • పాల్గొన్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మంత్రి లోకేశ్ తదితరులు

  • Jun 30, 2026 15:13 IST

    యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

    • హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌ కోసం భూమి కేటాయించాలి: సీఎం రేవంత్ రెడ్డి

    • మఠాలకు భూ కేటాయింపులపై విధానం రూపొందించాలి సీఎం రేవంత్ రెడ్డి

    • భూ యాజమాన్య హక్కులు ఆలయాలకే ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Jun 30, 2026 15:12 IST

    ఢిల్లీ: 11వ రోజుకు కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసన దీక్ష

    • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ డిమాండ్‌

    • మూడో రోజుకు చేరిన సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష

    • క్షీణిస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం

  • Jun 30, 2026 14:52 IST

    ఏపీ మహిళా కమిషన్‌ ముందుకు గుడివాడ అమర్నాథ్‌

    • హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఏపీ మహిళా కమిషన్‌కు వివరణ ఇవ్వనున్న అమర్నాథ్‌

  • Jun 30, 2026 14:51 IST

    ఏపీ లిక్కర్‌ రవాణా కేసులో ED కస్టడీ పిటిషన్‌

    • నిందితులను 7 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్‌

    • లిక్కర్‌ రవాణా వ్యవహారంలో మనీలాండరింగ్‌ హవాలాపై దర్యాప్తు చేయాల్సి ఉందన్న ED

    • కౌంటర్‌ దాఖలు చేసిన రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్‌ తరఫు న్యాయవాదులు

    • కస్టడీ పిటిషన్‌పై రేపు నాంపల్లి కోర్టు నిర్ణయం

  • Jun 30, 2026 14:45 IST

    MLA రాజాసింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట

    • మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో రాజాసింగ్‌‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

  • Jun 30, 2026 14:45 IST

    రైతులను సీఎం రేవంత్‌ మోసం చేశారు: హరీశ్ రావు

    • కాంగ్రెస్‌ది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ: హరీశ్ రావు

    • రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు: హరీశ్ రావు

    • రుణమాఫీ చేస్తామన్నారు.. జరిగిందా?: హరీశ్ రావు

    • కేసీఆర్‌ చేతిలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది: హరీశ్ రావు

    • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం: మాజీ మంత్రి హరీశ్ రావు

  • Jun 30, 2026 14:42 IST

    మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచిన రాష్ట్రాల్లో ఏపీకి అగ్రస్థానం

    • వ్యక్తిగత రుణాల పంపిణీలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఏపీ

    • మహిళలకు రూ.1,495.50 కోట్ల రుణాలు, 1.47 లక్షల మందికి లబ్ధి

    • PMFME పథకంలోనూ అగ్రస్థానంలో ఏపీ

  • Jun 30, 2026 14:02 IST

    హైదరాబాద్: ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం

    • హైకోర్టు ఆదేశాలతో FIR నమోదు చేసిన CBI

    • నిఖిల్ కేసులో లోతైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని CBIకి కేసు అప్పగించిన హైకోర్టు

    • రెండు రోజుల్లో నిఖిల్ తల్లిదండ్రుల వాంగ్మూలం రికార్డ్ చేయనున్న CBI

    • కేసులో ఆధారాలను CBIకి అప్పగించునున్న నిఖిల్ కుటుంబసభ్యులు

  • Jun 30, 2026 13:58 IST

    తెలంగాణ పోలీసులపై NHRC సీరియస్

    • రాజేశ్ లాకప్‌డెత్ కేసులో 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

    • CMRF ఫండ్‌ దుర్వినియోగం కేసులో రాజేశ్‌పై ఆరోపణలు

    • రాజేశ్‌పై కోదాడ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు NHRCకి న్యాయవాది రామారావు ఇమ్మినేని ఫిర్యాదు

    • పోస్ట్‌మార్టం సహా అన్ని రికార్డులు సమర్పించాలని ఆదేశం

    • సూర్యాపేట ఎస్పీ, కలెక్టర్‌కు NHRC నోటీసులు

  • Jun 30, 2026 13:31 IST

    ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ ధీరజ్‌ సేథ్‌

  • Jun 30, 2026 13:27 IST

    హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం

    • రోడ్ నంబర్ 4లోని ఓ ఇంట్లో వినిపించిన భారీ శబ్ధం

    • భారీ శబ్ధానికి ఇంట్లోని గోడలు, కిటికీల ధ్వంసం

    • ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్న కుటుంబసభ్యులు

    • దర్యాప్తు చేపట్టిన సరూర్‌నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది

  • Jun 30, 2026 13:24 IST

    CATలో సీనియర్ IPS పీ.వీ.సునీల్‌కుమార్‌కు దక్కని ఊరట

    • తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న సునీల్‌కుమార్‌ పిటిషన్‌ కొట్టివేత

    • అవినీతి ఆరోపణలతో సునీల్‌ కుమార్‌పై వేటు

  • Jun 30, 2026 13:11 IST

    సీఎం రేవంత్ టార్గెట్‌గా Xలో కేటీఆర్ ట్వీట్

    • దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారు: కేటీఆర్‌

    • ఇప్పుడు ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా?: కేటీఆర్‌

    • ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు: కేటీఆర్‌

    • సభల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు: కేటీఆర్

    • పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకున్నారు: కేటీఆర్‌

    • రేవంత్‌ ఎప్పటికీ రైతు ద్రోహిగానే ఉంటారు: కేటీఆర్‌

  • Jun 30, 2026 13:04 IST

    ఏపీ EAP సెట్‌ ఫలితాల విడుదల వాయిదా

    • సాంకేతిక సమస్యతో ఫలితాల విడుదల వాయిదా

    • జులై 2న ఫలితాలు విడుదల చేసే అవకాశం

  • Jun 30, 2026 13:03 IST

    హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఎస్ సంజయ్‌ జాజు

    • మధ్యాహ్నం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సంజయ్ జాజు

  • Jun 30, 2026 12:57 IST

    హైదరాబాద్: తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి కిషన్‌రెడ్డి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌

    • కాళేశ్వరంపై CBI విచారణ ఎందుకు చేయడం లేదు?: ఆది శ్రీనివాస్‌

    • కాళేశ్వరం అంశంలో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం: ఆది శ్రీనివాస్‌

    • కాళేశ్వరం అంశంలో బీజేపీ చిత్తశుద్ధి ఏమైంది?: ఆది శ్రీనివాస్‌

    • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టే విచారణ జరపడం లేదు: ఆది శ్రీనివాస్‌

  • Jun 30, 2026 12:51 IST

    అమరావతి: మామిడి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు: మంత్రి మండిపల్లి

    • కొనుగోళ్లలో జాప్యం జరిగితే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

    • రైతులను రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ మానుకోవాలి: మండిపల్లి

  • Jun 30, 2026 12:35 IST

    తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌ సేవలు

    • సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో సేవలకు బ్రేక్‌

    • రెండు రోజులుగా పనిచేయని సర్వర్‌

    • స్లాట్ బుకింగ్‌, రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం

    • 3 నెలల్లో నాలుగోసారి సాంకేతిక సమస్యలు

  • Jun 30, 2026 12:35 IST

    హైదరాబాద్‌: ఉన్నతవిద్యామండలి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత

    • ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ABVP శ్రేణుల యత్నం

    • పోలీసులు, ABVP శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట

  • Jun 30, 2026 12:24 IST

    ఢిల్లీ: బాబా ఆశారం బాపునకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట

    • బాలికపై అత్యాచారం కేసులో బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

    • ఆశారం బాపూ పిటిషన్‌పై రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

    • జీవిత ఖైదు అంశంలో రాజస్థాన్ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన ఆశారం బాపూ

    • 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

  • Jun 30, 2026 12:17 IST

    తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పిటిషన్లపై విచారణ జులై 6కు వాయిదా

    • గత విచారణలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

    • జులై 6 వరకు కొనసాగనున్న మధ్యంతర ఉత్తర్వులు

    • విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయొద్దని జీఓ నం.9లోని 4 నిబంధనలపై స్టే

  • Jun 30, 2026 12:12 IST

    TMCకి కోల్‌కతా హైకోర్టులో దక్కని ఊరట

    • పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు నిరాకరణ

    • సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న మమతా బెనర్జీ

  • Jun 30, 2026 12:09 IST

    ఢిల్లీ: ఆన్‌లైన్ కోర్టు విచారణలో లాయర్ బాధ్యతారాహిత్యం

    • మైక్‌ ఆన్‌లో ఉందన్న సంగతి మరచి.. జడ్జిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గుజరాతీ అడ్వకేట్‌

    • వర్చువల్ హియరింగ్స్ ప్రమాదాలను హెచ్చరిస్తూ సీనియర్ అడ్వొకేట్‌ సంజయ్ ఘోష్ 'X'లో పోస్ట్

  • Jun 30, 2026 12:01 IST

    రేపటి నుంచి భారత్‌ పర్యటనలో జపాన్ ప్రధాని తకయిచి

    • 3 రోజుల భారత్‌ పర్యటనకు జపాన్ ప్రధాని

    • రేపటి నుంచి భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం

    • మోదీ-తకయిచి మధ్య ద్వైపాక్షిక చర్చలు

    • ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురి చర్చలు

  • Jun 30, 2026 11:50 IST

    'SIR' ప్రక్రియపై CJIకి ఇండియా కూటమి లేఖ

    • ఎన్నికల సంఘం చర్యలపై CJIకి ఫిర్యాదు

    • CJIకి లేఖ పంపిన 23 రాజకీయ పార్టీలు

    • ఎన్నికల అంశాలపై CJI జోక్యం కోరిన ఇండియా కూటమి

  • Jun 30, 2026 11:42 IST

    ఢిల్లీ: రూ.27 కోట్ల గోల్డ్ డీల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    • 8 కేజీల బంగారానికి సమానమైన నగదును కోర్టులో డిపాజిట్ చేయాలన్న సుప్రీంకోర్టు

    • మూడు వారాల్లోగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశం

    • 36 కేజీల బంగారానికి డబ్బులు తీసుకుని 27 కేజీలే ఇచ్చిన నిందితుడు

    • మిగిలిన 8 కేజీల బంగారం ఎగ్గొట్టారంటూ వృద్ధుడిపై కేసు నమోదు

  • Jun 30, 2026 11:36 IST

    హైదరాబాద్: ఘట్‌కేసర్ పోకిరీల అంశంలో కొనసాగుతున్న విచారణ

    • కారులో వెళ్తున్న కుటుంబాన్ని వేధించిన పోకిరీలు

    • కారును వెంబడించి ఆరుగురు ఆకతాయిల దాడి

    • పోకిరీల కోసం మల్కాజ్‌గిరి పోలీసుల గాలింపు

    • పోకిరీల వేధింపులపై సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేసిన బాధితుడి సోదరి

    • సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు

  • Jun 30, 2026 11:24 IST

    మహారాష్ట్ర: ముంబైలో భారీ వర్షాలు

    • 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదు

    • పలు పల్లపు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జామ్‌

  • Jun 30, 2026 11:19 IST

    అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి

    • ఏటా వెలువడుతున్న రూ.18.9 కోట్ల విలువైన పసిడి ధూళి

    • రోజూ 80 గ్రాముల బంగారం విడుదల

    • సూక్ష్మ బంగారు కణాల గుర్తింపు

    • వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించే కణాలు

    • మంచుపై పేరుకుపోతున్న బంగారు ధూళి

    • మౌంట్ ఎరెబస్‌పై శాస్త్రవేత్తల అధ్యయనం

    • జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ ప్రచురణ

  • Jun 30, 2026 10:58 IST

    ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

    • తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ

    • ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

    • ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ

    • ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయం

  • Jun 30, 2026 10:43 IST

    భారీగా తగ్గిన బంగారం ధరలు

    • హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,130

    • 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,450

    • రూ.2,44,900 వద్ద ట్రేడ్ అవుతోన్న కిలో వెండి ధర

    పూర్తి కథనం

  • Jun 30, 2026 10:16 IST

    ఫిఫా ప్రపంచ కప్: పెనాల్టీ షూటౌట్‌లో మొరాకో విజయం

    • పెనాల్టీ షూటౌట్‌లో 3-2 తేడాతో నెదర్లాండ్స్‌పై మొరాకో విజయం

    • తొలుత 1-1తో డ్రా కావడంతో అనివార్యమైన పెనాల్టీ షూటౌట్

  • Jun 30, 2026 10:11 IST

    నంద్యాల ఎస్సై భరత్‌కుమార్‌పై వరకట్న వేధింపుల కేసు

    • అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణను ఆశ్రయించిన భార్య ప్రియాంక

    • ASP ఆదేశాలతో కేసు నమోదు

    • దర్యాప్తు ప్రారంభించిన ప్రొద్దుటూరు 1-టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి

  • Jun 30, 2026 10:11 IST

    ఆసియా గేమ్స్: మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్

    • భారత మహిళల జట్టు ప్రకటన

    • సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు

  • Jun 30, 2026 10:09 IST

    అమరావతి: రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పరిధి తగ్గింపు

    • రామాయపట్నం పోర్టు ప్రస్తుతం ఉన్న 51 కి.మీ. విస్తీర్ణాన్ని 15 కి.మీ.కు కుదింపు

    • మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కి.మీ. నుంచి 15 కి.మీ.కు తగ్గింపు

  • Jun 30, 2026 10:08 IST

    చిత్తూరు: గంగవరం మం. బండమీద జరావారిపల్లెలో బాలిక అనుమానాస్పద మృతి

    • ఇంట్లో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

    • తమ కూతురిది హత్యేనని తల్లిదండ్రుల ఆరోపణ

    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 30, 2026 10:02 IST

    నంద్యాల: శ్రీశైలంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు

    • శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పేరుతో వైసీపీ హయాంలో నిధులు పక్కదారి పట్టించిన అధికారులు

    • కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ విచారణ

    • శ్రీశైలం దేవస్థానంలో ఇంజినీరింగ్ పనులపై స్పందించిన దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్

    • అప్పటి ఈఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశం

  • Jun 30, 2026 09:58 IST

    నష్టాల్లో దేశీయ సూచీలు

    • 230 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్

    • 80 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.61

  • Jun 30, 2026 09:57 IST

    ఉత్తర్ ప్రదేశ్‌: మధుర జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం

    • రాయా పోలీస్ స్టేషన్ పరిధిలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొట్టిన బస్సు

    • ఈ ప్రమాదంలో నలుగురి మృతి, 20మందికి పైగా గాయాలు

    • క్షతగాత్రులను మధుర జిల్లా ఆస్పత్రికి తరలింపు

  • Jun 30, 2026 09:52 IST

    అమరావతి: నేడు మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • నెట్‌వర్క్‌ సర్వీస్ ప్రొవైడర్స్‌తో చంద్రబాబు సమావేశం

  • Jun 30, 2026 09:48 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. వివరాలు సేకరిస్తున్న సిట్ అధికారులు

    • లాకప్‌డెత్ తర్వాత కృష్ణలంక RMP డాక్టర్‌తో వైద్యం చేయించినట్లు గుర్తించిన సిట్

    • లాకప్‌డెత్ అంశం వెలుగులోకి రాగానే పరారైన RMP డాక్టర్

    • RMP డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

    • ఇదే కేసులో సిట్ అదుపులో కృష్ణలంకకు చెందిన లేడీ కానిస్టేబుల్‌

  • Jun 30, 2026 09:19 IST

    తిరుపతి: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి దాసరి శంకర్ అరెస్ట్

    • ఎస్వీ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ జువాలజీ అకాడమిక్ కన్సల్ట్‌గా విధులు నిర్వహిస్తున్న శంకర్

    • నకిలీ బిల్లులు, స్టాంపులు వినియోగించి విద్యార్థుల నగదు కాజేసినట్లు ఫిర్యాదు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 30, 2026 09:07 IST

    నేడు యాదాద్రి టెంపుల్ అథారిటీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

    • మధ్యాహ్నం 12:00 గంటలకు సమావేశం

    • యాదాద్రి అభివృద్ధి, బోర్డ్ ఏర్పాటుపై సీఎం రేవంత్ చర్చ

  • Jun 30, 2026 08:47 IST

    నేడు తెలంగాణ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సంజయ్ జాజు

    • నేటితో ముగియనున్న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం

    • మ.2:15 గంటలకు సచివాలయంలో రామకృష్ణారావు నుంచి బాధ్యతలు స్వీకరించనున్న సంజయ్ జాజు

  • Jun 30, 2026 08:36 IST

    పశ్చిమ బెంగాల్‌: హల్దియా రిఫైనరీలో అగ్ని ప్రమాదం

    • నాఫ్తాను తరలిస్తున్న పైప్‌లైన్‌లో చెలరేగిన మంటలు

    • కనీసం 15 మంది గాయపడినట్టు సమాచారం

    • సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది

  • Jun 30, 2026 08:28 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు

    • మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసిన సిట్

    • సాయికృష్ణ లాకప్‌డెత్, మృతదేహం మాయం చేసిన అంశంలో నిందితులుగా అశోక్, నాని, సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్

    • నేడు ముగ్గురిని కోర్టులో హాజరుపర్చనున్న సిట్ అధికారులు

  • Jun 30, 2026 08:16 IST

    శ్రీకాకుళం: ఆమదాలవలస మం. వెదుళ్ల వలస గ్రామంలో దారుణం

    • ఇద్దరు పిల్లల గొంతుకోసి చంపిన తల్లి కూర్మాపు వరలక్ష్మి

    • ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం

    • ఇద్దరు పిల్లల మృతి.. విషమంగా తల్లి వరలక్ష్మి పరిస్థితి

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 30, 2026 08:08 IST

    నెల్లూరు: సంగ మండలం తరుణ వాయు వద్ద మినీ ట్రక్కును ఢీకొన్న లారీ

    • ఓ యువతి మృతి, మరో యువతికి తీవ్ర గాయాలు

    • ఆర్లగడ్డ నుంచి నెల్లూరు రొట్టెల పండగకు వెళ్తుండగా ప్రమాదం

  • Jun 30, 2026 08:05 IST

    అమరావతి: మరోసారి పోలీసు విచారణకు MLC దువ్వాడ శ్రీనివాస్‌

    • నేడు మ.2:00 గంటలకు కొత్తూరు పీఎస్‌లో దువ్వాడ విచారణ

  • Jun 30, 2026 07:48 IST

    గద్వాల జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

    • అన్ని శాఖల అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

  • Jun 30, 2026 07:42 IST

    తెలంగాణలో నేడు రైతు భరోసా నిధుల విడుదల

    • హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిధుల విడుదల

    • దశలవారీగా 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమకానున్న నిధులు

  • Jun 30, 2026 07:28 IST

    హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై AI మార్ఫింగ్ వీడియోల కలకలం

    • మంత్రి శ్రీధర్‌బాబు, IAS శైలజా రామయ్యర్ దంపతులపై AI మార్ఫింగ్ వీడియోలు

    • ఫేస్‌బుక్‌లో అనుచిత కంటెంట్‌తో వీడియోలు పోస్టు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు

    • పోలీసులకు పిర్యాదు చేసిన న్యాయవాది శశిభూషణ్ కాశే

    • కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు

  • Jun 30, 2026 07:26 IST

    నల్లగొండ: కట్టంగూరు మం. ముత్యాలమ్మగూడెం వద్ద రోడ్డు ప్రమాదం

    • ప్రైవేట్ బస్సు-లారీ ఢీ, డ్రైవర్లకు తీవ్ర గాయాలు

    • విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు

    • ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం

    • ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు

  • Jun 30, 2026 07:26 IST

    నేటి మార్కెట్లో బంగారం ధరల వివరాలు

    • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,070

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,30,240

    • హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఒకే విధంగా ధరలు

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,920

    • 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,30,090

    • రూ.2,44,900 వద్ద ట్రేడ్ అవుతున్న కిలో వెండి రేటు

  • Jun 30, 2026 07:25 IST

    నేడు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

    • కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం

    • ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • హాజరుకానున్న గవర్నర్ నజీర్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి లోకేశ్

    • 373 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు, 13 మందికి బంగారు పతకాల ప్రదానం

  • Jun 30, 2026 07:23 IST

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ఓఎస్‌డీకి రీ-అపాయింట్‌మెంట్‌

    • నేడు రిటైర్‌ కానున్న వెంకటకృష్ణకు మూడేళ్ల పొడిగింపు

    • జులై 1 నుంచి ఓఎస్‌డీగా కొనసాగనున్న వెంకటకృష్ణ

    • డిప్యూటీ సీఎం కార్యాలయంలోనే సేవల కొనసాగింపు

  • Jun 30, 2026 07:22 IST

    నేటి నుంచి మరో ఐదు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ

    • ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రారంభం కానున్న SIR

    • జులై 29 వరకు కొనసాగనున్న ప్రక్రియ

    • ఆగస్టు 5న డ్రాఫ్ట్‌ రోల్‌, అక్టోబర్‌ 10న తుది ఓటర్ల జాబితా

  • Jun 30, 2026 07:16 IST

    విజయవాడ: సాయికృష్ణ కేసు విచారణ

    • హెడ్‌కానిస్టేబుళ్లు నాని, సురేశ్‌లను నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

    • హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ మెన్షన్‌ చేసే అవకాశం

  • Jun 30, 2026 07:15 IST

    తెలంగాణలో మూడో రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పర్యటన

    • ఘట్‌కేసర్‌లో నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

    • ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో పాల్గొననున్న నితిన్‌ నబీన్‌

  • Jun 30, 2026 07:11 IST

    నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ

    • నేటితో ముగియనున్న ఉత్సవాలు

  • Jun 30, 2026 07:05 IST

    నేడు అయోధ్యకు కాంగ్రెస్‌ ఎంపీలు, నేతల బృందం

    • అయోధ్య ఆలయ విరాళాల చోరీ అంశంపై నిరసన

    • అజయ్‌రాయ్‌ నేతృత్వంలో ఎంపీల పాదయాత్ర

  • Jun 30, 2026 07:03 IST

    దోహా ట్రాక్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్‌

    • ఇప్పట్లో అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని వెల్లడి

    • యూఎస్-ఇరాన్‌ పీస్‌ డీల్‌పై చర్చలు ప్రారంభం కాలేదని స్పష్టీకరణ

    • త్వరలో తమ బృందం ఖతార్‌ వెళ్లనున్నట్లు ప్రకటన

  • Jun 30, 2026 06:59 IST

    నాతో సమావేశానికి ఇరాన్‌ అభ్యర్థించింది: ట్రంప్‌

    • ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఉంటాయి: ట్రంప్‌

  • Jun 30, 2026 06:58 IST

    ఏపీ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ఎక్స్ ఖాతా హ్యాక్

    • @rameshpv2010 ఎక్స్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఫిర్యాదు

    • హ్యాక్ అయిన ఖాతాలో అనధికారిక పోస్టులు పెడుతున్నారని ఆరోపణ

    • హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పీవీ రమేశ్ ఫిర్యాదు

    • ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు

  • Jun 30, 2026 06:55 IST

    ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • నూతన ఈవీ(EV) పాలసీకి ఆమోదం

    • రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త విధానం

    • రూ.30 లక్షలలోపు ఈ-కార్ల రిజిస్ట్రేషన్

    • రోడ్ టాక్స్‌పై 100 శాతం మినహాయింపు

  • Jun 30, 2026 06:50 IST

    TG20 లీగ్‌: హైదరాబాద్‌ ఈ-ఛాంపియన్స్‌కు వరుసగా నాలుగో విజయం

    • ఖమ్మం ఏసెస్‌పై 56 పరుగుల తేడాతో ఈ-ఛాంపియన్స్‌ గెలుపు

    • స్కోర్లు: హైదరాబాద్‌ 211/9, ఖమ్మం 155/9

  • Jun 30, 2026 06:48 IST

    ఫిఫా వరల్డ్ కప్: నాకౌట్స్‌లో పరాగ్వే సంచలన విజయం

    • నాలుగుసార్లు WC విజేత జర్మనీపై పరాగ్వే గెలుపు

    • పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే 4-3తో సంచలన విజయం

    • తర్వాతి పోరులో ఫ్రాన్స్‌-స్వీడన్‌ మ్యాచ్‌ విజేతతో తలపడనున్న పరాగ్వే