బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ఉండాల్సిందే.. యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు చుక్కెదురు..
ABN , Publish Date - Jun 30 , 2026 | 09:06 PM
బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలిక ప్రాతిపదికన నివసిస్తున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూయార్క్, జూన్ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలిక ప్రాతిపదికన నివసిస్తున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా గడ్డపై జన్మించిన దాదాపు ప్రతి ఒక్కరికీ అమెరికన్ పౌరసత్వ హక్కును కొనసాగించేలా 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
అంతకుముందు, పౌరసత్వంపై ట్రంప్ విధించిన ఈ పరిమితులను అమెరికాలోని పలు కిందిస్థాయి కోర్టులు కొట్టేశాయి. ట్రంప్ ఉత్తర్వుల అమలును నిలిపివేశాయి. వీటిని సవాలు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. గత కొన్ని నెలల నుంచి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. మంగళవారం జరిగిన విచారణలో కింది కోర్టుల తీర్పులతో ఏకీభవించిన సుప్రీంకోర్టు మెజారిటీ ధర్మాసనం.. ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమని తేల్చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని బెంచ్ ట్రంప్ ఉత్తర్వులను కొట్టేసింది.
ఇవి కూడా చదవండి
అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు.. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం
ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్ రావు