Share News

ప్రజల జీవితాలను మార్చేదే అసలైన విద్య: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:00 PM

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు.

ప్రజల జీవితాలను మార్చేదే అసలైన విద్య: మంత్రి నారా లోకేశ్
Minister Nara lokesh

విశాఖపట్నం, జూన్ 30: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందన్నారు. స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము అని కొనియాడారు. విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఈరోజు(మంగళవారం) విశాఖలోని కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా13 మందికి రాష్ట్రపతి బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, మంత్రి సంధ్యారాణి, ట్రైబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, వీసీ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఐపీఎస్ సునీల్ కుమార్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన ‘క్యాట్’

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారితో పాటు ఇద్దరి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 05:01 PM