మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే నంబర్-1
ABN , Publish Date - Jun 30 , 2026 | 03:12 PM
మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత రుణాల పంపిణీలో కూడా ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
అమరావతి, జూన్ 30: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత రుణాల పంపిణీలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.47 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,495.50 కోట్ల మేర రుణాలు మంజూరు చేయడం ద్వారా స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల అభివృద్ధికి ఊతమిచ్చింది. ఈ రుణాల ద్వారా మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారని అధికారులు పేర్కొన్నారు.
అదే విధంగా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల అధికారికీకరణ పథకం (PMFME) అమలులోనూ ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ పథకం ద్వారా ఆహార ప్రాసెసింగ్ రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం, సాంకేతిక శిక్షణ, మార్కెటింగ్ మద్దతు అందిస్తూ వేలాది మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి
మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Read Latest AP News And Telugu News