Share News

మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:18 PM

మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.

మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Minister Ramprasad Reddy

అమరావతి, జూన్ 30: మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది కూడా కూటమి ప్రభుత్వం రైతులకు కేజీకి రూ.4 చెల్లించి అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా కేజీకి రూ.4 ముందస్తు చెల్లించి మామిడి కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని తెలిపారు. పంట దిగుబడి అధికంగా రావడంతో తాత్కాలికంగా కొనుగోళ్లపై ఒత్తిడి ఏర్పడిందని చెప్పారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.


రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొనుగోళ్లలో జాప్యం జరిగితే సంబంధిత ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వైసీపీ సానుభూతి కంపెనీలు కొనుగోళ్లలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించమన్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రైతులను వైసీపీ.. రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 12:20 PM