సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్
ABN , Publish Date - Jun 30 , 2026 | 08:39 AM
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మెమో దాఖలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్‌తోపాటు మృతదేహం మాయం చేసిన వ్యవహారంలో అశోక్, నాని, సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్‌ను ఈ మెమోలో నిందితులుగా చేర్చింది.
విజయవాడ, జూన్ 30: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మెమో దాఖలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్, మృతదేహం మాయం చేసిన వ్యవహారంలో అశోక్, నాని, సీఐ నాగరాజు స్నేహితుడు సురేశ్‌ను ఈ మెమోలో నిందితులుగా చేర్చింది. ఈ రోజు (మంగళవారం) వీరిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఇప్పటికే సురేశ్, నాని, అశోక్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుతోపాటు ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది.
సోమవారం దక్షిణ మండలం ఏసీపీ మానస ఎదుట హెడ్ కానిస్టేబుళ్లు నాని, అశోక్ లొంగిపోయారు. అనంతరం వారిని దాదాపు 8 గంటల పాటు విచారించారు. సీఐ నాగరాజుతో కలిసి సాయికృష్ణను ఏమి చేశారనే ప్రశ్నకు వీరు సమాధానం చెప్పలేదని సమాచారం. సిట్ అధికారి సుధాకర్ అడిగిన పలు ప్రశ్నలకు అశోక్, నాని మౌనమే సమాధానం అన్నట్లుగా ఉన్నారు. మరో హెడ్ కానిస్టేబుల్ బాబురావు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం అతడిని సిట్ అధికారులు పంపించేశారు.
సిట్ అధికారుల అదుపులో..
ఈ లాకప్ డెత్ కేసులో కీలక సాక్షులను నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ అనంతరం కృష్ణలంకకు చెందిన ఆర్ఎంపీ వైద్యునితో వైద్యం చేయించినట్లు సిట్ గుర్తించింది. తాజాగా ఆర్ఎంపీ వైద్యుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. సదరు ఆర్ఎంపీ వైద్యుడు పరారైన సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో కృష్ణలంకకు చెందిన మరో లేడీ కానిస్టేబుల్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ ఎక్స్ అకౌంట్ హ్యాక్
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన రహదారి.. భారీగా నిలిచిన పర్యాటకుల వాహనాలు
For More AP News And Telugu News