రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ ఎక్స్ అకౌంట్ హ్యాక్
ABN , Publish Date - Jun 30 , 2026 | 07:08 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి. వి. రమేశ్ ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి. వి. రమేశ్ ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. @rameshpv2010 తన ఎక్స్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ-మెయిల్ అలర్ట్ రావడంతో పాస్‌వర్డ్ మార్చుకున్నానని ఆయన వివరించారు. హ్యాక్ అయిన తన ఖాతాలో అనధికారిక పోస్టులు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపండి..!
ఆ స్కూల్‌ను కొత్త భవనంలోకి మార్చండి: హైకోర్టు
For More TG News And Telugu News