Share News

ఆ స్కూల్‌ను కొత్త భవనంలోకి మార్చండి: హైకోర్టు

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:39 AM

లాలపేట్‌లోని డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌(విజయ డెయిరీ) ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ...

ఆ స్కూల్‌ను కొత్త భవనంలోకి మార్చండి: హైకోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): లాలపేట్‌లోని డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌(విజయ డెయిరీ) ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న డీ-టైప్‌ భవనం నుంచి ఏ2 టైప్‌ భవనంలోకి పాఠశాలను తరలించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నెలలోనే దాన్ని తరలించాలని, విద్యుత్‌, తాగునీటి వసతి కల్పించాలని స్పష్టం చేసింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు ఖాళీగా ఉన్న క్వార్టర్‌ కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పాఠశాలను వెంటనే తరలించాలని ఆదేశింశించింది.

Updated Date - Jun 30 , 2026 | 05:39 AM