Share News

బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం.. తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 10:52 AM

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. కన్న కొడుకు కళ్ల ముందే తల్లి దుర్మరణం చెందింది.

బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం.. తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు
Hyderabad Road Accident

హైదరాబాద్, జూన్ 30: నగరంలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. కన్న కొడుకు కళ్ల ముందే తల్లి దుర్మరణం చెందింది. ఈరోజు(మంగళవారం) ఉదయం బహుదూర్ పల్లి గ్రామం మెయిన్ రోడ్‌పై మద్యం మత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకును బొలెరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఉదయ్ లతారెడ్డి(49) అక్కడికక్కడే మృతిచెందగా.. కొడుకు వేదాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.


సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వేదాంత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే లతారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు అయ్యింది.


ఇవి కూడా చదవండి...

శ్రీశైలం ఆలయంలో నిధుల దుర్వినియోగం.. చర్యలకు కమిషనర్ ఆదేశం

సాయికృష్ణ లాకప్ డెత్.. ముగ్గురిని నిందితులుగా చేర్చిన సిట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 10:53 AM