గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:10 PM
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. నిన్న (మార్చ్ 20) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలు ఉండింది.
ఇంటర్‌నెట్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. నిన్న (మార్చ్ 20) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలు ఉండింది. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారంపై 2,940 రూపాయలు.. 22 క్యారెట్ బంగారంపై 2,750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 రూపాయల దగ్గర.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు పతనం
బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. నిన్న కిలో వెండి 2,60,000 రూపాయల దగ్గర.. 100 గ్రాముల వెండి 26,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు కిలోపై 10 వేల రూపాయలు.. 100 గ్రాములపై వెయ్యి రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 2,50,000 రూపాయల దగ్గర, 100 గ్రాముల వెండి 25 వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (24కే 10 గ్రాములు ) ధరలు ఇవీ..
చెన్నై: ₹1,45,970
ముంబై: ₹1,45,970
న్యూఢిల్లీ: ₹1,46,120
కోల్‌కతా: ₹1,45,970
బెంగళూరు: ₹1,45,970
హైదరాబాద్: ₹1,45,970
విజయవాడ: ₹1,45,970
కేరళ: ₹1,45,970
పుణే: ₹1,45,970
వడోదరా: ₹1,46,020
అహ్మదాబాద్: ₹1,46,020
ఇవి కూడా చదవండి
ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు.. ఎంత ప్రమాదకరమో తెలుసా?
కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రకటించిన ఇరాన్