కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రకటించిన ఇరాన్
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:03 PM
ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. కాల్పుల విరమణకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం 22వ రోజుకు చేరుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) స్పందించారు. కాల్పుల విరమణకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గత అనుభవాలు పునరావృతం కావాలని తాము కోరుకోవడం లేదన్నారు. యుద్ధం ముగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము వినడానికి, పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
'ప్రస్తుతం కొన్ని దేశాలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయి. దాడులను నిలిపివేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ కారణంగా మేము మా దేశాన్ని కాపాడుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం' అని అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. యుద్ధానికి ముగింపు అంటూ జరిగితే అది పూర్తిగా, ఎప్పటికీ యుద్ధానికి దిగకుండా ఉంటామనే హామీ రూపంలో ఉండాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. కేవలం దేశ పరిరక్షణ కోసమే ఇరాన్ యుద్ధం సాగిస్తోందని చెప్పారు.
శత్రు నౌకలకు మాత్రమే..
వ్యూహాత్మక హోర్మూజ్ జలసంధిని మూసివేయడంపై అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ, శత్రుదేశాల నౌకలకు మాత్రమే మార్గం మూసేసినట్టు చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా మార్చి 2న హోర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఇటు ఇరాన్ కానీ, అటు అమెరికా-ఇజ్రాయెల్ కానీ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో సమస్య మరింత బిగుసుకుంటోంది. కచ్చితమైన హామీలు, పరిహారం ఇవ్వాలని ఇరాన్ పట్టుబడుతోంది. అమెరికా సైతం తామ అనుకున్న లక్ష్యాలకు చేరువలో ఉన్నామని సంకేతాలు ఇస్తూనే సైనిక చర్యలను నిలిపివేసేందుకు నిరాకరిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌పై దాడులకు స్వస్తి చెప్పే యోచనలో ట్రంప్
4 వేల కిలోమీటర్ల దూరంలోని యూఎస్ స్థావరంపైకి ఇరాన్ మిసైల్స్!