Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 14 , 2026 | 07:21 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 14, 2026 08:28 IST

    జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నాకు యత్నించిన CJP నేతల అరెస్ట్‌

    • అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌, అజింక్య షిండే అరెస్ట్‌

    • CJP ప్రతినిధులను కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

  • Oct 14, 2026 08:28 IST

    పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతపై దాడి

    • కాళీఘాట్‌లో మమతపైకి దూసుకెళ్లిన మహిళ

    • దుర్గాపూజ మండపాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన మమత

    • మమతా బెనర్జీ చీరను లాగేందుకు యత్నం

  • Oct 14, 2026 08:13 IST

    తమిళనాడులోని దేవాలయాల్లో ఉచిత అన్నదాన పథకం విస్తరణ

    • 10 దేవాలయాలకు విస్తరించిన ప్రభుత్వం

  • Oct 14, 2026 08:08 IST

    ఖమ్మం: వైరా మండలం అష్టగుర్తిలో కొండ చిలువ కలకలం

    • ఎస్టీ కాలనీలో రోడ్డుపై తిరుగుతున్న కొండచిలువను చంపిన స్థానికులు

  • Oct 14, 2026 08:04 IST

    విశాఖ: నగర పరిధిలో ఆపరేషన్ గరుడ

    • మెడికల్ ఫార్మా, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలపై దాడులు

    • డ్రగ్ కంట్రోలర్‌ నార్కోటిక్ కంట్రోల్‌ బ్యూరో, ఈగల్‌ అధికారుల సంయుక్త తనిఖీలు

    • పలుచోట్ల గడువు ముగిసిన మందుల గుర్తింపు

  • Oct 14, 2026 07:56 IST

    ఏపీ విధుల్లో చేరని ఇద్దరు జడ్పీ CEOల సస్పెన్షన్‌

    • పోలవరం జడ్పీ CEO కిశోర్‌కుమార్‌ సస్పెన్షన్‌

    • నంద్యాల జడ్పీ CEO ఊర్మిళా దేవి సస్పెన్షన్‌

    • ఈ నెల 10న జడ్పీ CEOలుగా ఇద్దరికీ పోస్టింగ్‌లు

    • నియామక ఉత్తర్వులు ఇచ్చినా విధుల్లో చేరని అధికారులు

  • Oct 14, 2026 07:45 IST

    నేడు హైటెక్స్‌లో SSC ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

  • Oct 14, 2026 07:42 IST

    మహారాష్ట్ర: నలాసోపారాలో భారీ అగ్నిప్రమాదం

    • బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు

    • 13వ అంతస్తులోని ఫ్లాట్‌లో ఎగసిపడ్డ మంటలు

    • మంటల్లో వృద్ధురాలు మృతి, ఏడుగురికి గాయాలు

    • 40 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది

  • Oct 14, 2026 07:36 IST

    నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

    • ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ

  • Oct 14, 2026 07:36 IST

    తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

    • నేడు సింహవాహనంపై ఊరేగనున్న శ్రీవారు

    • రాత్రి ముత్యపుపందిరి వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

  • Oct 14, 2026 07:36 IST

    నిర్మల్‌: బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు

    • నేడు కూష్మాండ అలంకారంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు

  • Oct 14, 2026 07:35 IST

    హైదరాబాద్‌: నేడు ED విచారణకు వైఎస్‌ అవినాశ్ రెడ్డి

    • వివేకా హత్య కేసులో ప్రశ్నించనున్న ED

  • Oct 14, 2026 07:34 IST

    నేడు గద్వాల జిల్లాలో హరీశ్ రావు పర్యటన

    • కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గట్టు మండలానికి చెందిన కూలీల కుటుంబాలకు పరామర్శ

    • ఎండిన పంటలను పరిశీలించనున్న హరీశ్ రావు

  • Oct 14, 2026 07:34 IST

    నేడు ఎల్‌నినోపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక సమావేశం

  • Oct 14, 2026 07:33 IST

    అమరావతి: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ

    • నేడు పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న వంగవీటి రాధాకృష్ణ

    • ఇటీవలే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కలిసిన వంగవీటి రాధాకృష్ణ

  • Oct 14, 2026 07:32 IST

    నేడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

    • 3 దశల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న EC

    • నేడే మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న EC

    • అన్ని జిల్లాల నుంచి ECకి చేరిన గెజిట్ నోటిఫికేషన్లు

  • Oct 14, 2026 07:31 IST

    నేడు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • రాత్రి 7:10కు ఇంద్రకీలాద్రికి చేరుకోనున్న ద్రౌపదిముర్ము

    • దుర్గమ్మ సన్నిధిలో అరగంట పాటు ఉండనున్న రాష్ట్రపతి

    • రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అరగంటపాటు దర్శనాలు నిలిపివేత

  • Oct 14, 2026 07:31 IST

    ఢిల్లీ: వివిధ వర్గాలతో సమావేశంకానున్న ఇండియా కూటమి

    • భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్న ఇండియా కూటమి నేతలు

    • CEC, SIRకి వ్యతిరేకంగా దేశంలో నిరసనలకు ప్రణాళిక

    • హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో నిరసనలు చేపట్టాలని ప్లాన్‌

  • Oct 14, 2026 07:30 IST

    విజయవాడ: నేడు పున్మమి ఘాట్‌లో సరస్ మేళా ప్రారంభం

    • సరస్‌ మేళాను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • సరస్‌ మేళాలో అన్ని రాష్ట్రాల ఉత్పత్తుల స్టాళ్లు

  • Oct 14, 2026 07:30 IST

    నేడు గోదావరిఖనిలో సింగరేణి కార్మిక గర్జన సభ

    • సాయంత్రం 5 గంటలకు TGBKS ఆధ్వర్యంలో సభ

    • బహిరంగ సభకు హాజరుకానున్న కేటీఆర్‌

  • Oct 14, 2026 07:30 IST

    హైదరాబాద్‌: నేడు భారత్‌ Vs వెస్టిండీస్ నాలుగో T20 మ్యాచ్‌

    • ఉప్పల్‌ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్‌

    • ఉప్పల్ స్టేడియం దగ్గర 2,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

  • Oct 14, 2026 07:28 IST

    సీజ్ ఫైర్‌ను రష్యా లెక్క చేయట్లేదు: జెలెన్‌స్కీ

    • రష్యా మిసైల్ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆగ్రహం

    • మరిన్ని దాడులు జరగవచ్చని ఆందోళన

    • మంగళవారం నాటి దాడుల్లో ఇద్దరి మృతి.. 21 మందికి గాయాలు

  • Oct 14, 2026 07:21 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రిలో నాలుగో రోజుకు చేరుకున్న శరన్నవరాత్రి మహోత్సవాలు

    • శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు

    • అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి క్యూ లైన్‌లో భారీలు తీరిన భక్తులు

    • అమ్మవారి నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి

  • Oct 14, 2026 07:21 IST

    హైదరాబాద్‌: LIC నుంచి న్యూ జీవన్‌ ధారా-2

    • హెల్త్ షీల్డ్‌, న్యూ క్యాన్సర్‌ కవర్‌ అనే 3 కొత్త పథకాలు

    • ఈ నెల 19 నుంచి ఈ పాలసీల విక్రయాలు