Share News

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:29 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
Local Body Elections

అమరావతి, అక్టోబర్ 14: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు(బుధవారం) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్‌ను విడుదల చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్‌‌ను‌‌ విడుదల చేశారు. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు.


రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్‌ బాడీస్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈనెల 28న ఎన్నికలు జరగనుండగా.. 30న ఫలితాలను వెల్లడికానున్నాయి. ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఈనెల 19న నామినేషన్ల స్క్రూటినీ చేయనున్నారు. ఈనెల 21లోపు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.


ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..

  • నవంబర్‌ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

  • నవంబర్‌ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు

పంచాయతీ ఎన్నికలు..

పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు.

  • నవంబర్‌ 26న తొలిదశ పంచాయతీ ఎన్నికలు

  • నవంబర్‌ 29న తొలిదశ పంచాయతీ ఎన్నికలు

  • డిసెంబర్‌ 2న మూడోదశ పంచాయతీ ఎన్నికలు

  • పంచాయతీలకు ఎన్నికల రోజే ఫలితాలు విడుదల


ఇవి కూడా చదవండి...

వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి

ఏపీ స్థానిక ఎన్నికలు.. సీట్ల సర్దుబాటుపై తుది చర్చల్లో కూటమి నేతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 04:07 PM