ఏపీ స్థానిక ఎన్నికలు.. సీట్ల సర్దుబాటుపై తుది చర్చల్లో కూటమి నేతలు
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:16 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు మరోసారి సమావేశమయ్యారు.
అమరావతి, అక్టోబర్ 14: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు మరోసారి సమావేశమయ్యారు. ఈరోజు(బుధవారం) టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ రావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, శివ శంకర్ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై నేడు తుది చర్చలు జరగనున్నాయి. ఇక నిన్న(మంగళవారం) అర్ధరాత్రి వరకూ కూటమి నేతలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. జనసేన ఆరు కార్పొరేషన్లు, 40 మున్సిపాలిటీలు పొత్తులో భాగంగా ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మూడు కార్పొరేషన్లు, 15 వరకు పురపాలక సంఘాలు ఇచ్చేందుకు టీడీపీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీకి ఒక కార్పొరేషన్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో మాట్లాడి వస్తామని చెప్పి గత రాత్రి జనసేన నేతలు వెళ్లిపోగా.. ఈరోజు చర్చలలో ఇద్దరు చెరో మెట్టు దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేన తమకు కావాలని పట్టుబడుతున్న విజయవాడలో అప్పుడే అభ్యర్థిపై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం జనసేనాని సమక్షంలో వంగవీటి రాధా పార్టీలో చేరనున్నారు. విజయవాడ ఓసీ జనరల్ కావడంతో పొత్తులో తమకు వచ్చే సీటులో పోటీ చేయించేందుకు వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్ ప్రెస్మీట్ కూడా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
ఎన్సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. చంద్రబాబు, లోకేశ్ సంతాపం
వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి
Read Latest AP News And Telugu News