Share News

తెల్ల ‘బంగారం’.. జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.9,200

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:12 PM

పత్తి రైతులకు ఈ ఏడాది ధరలు ఊరటనిస్తున్నాయి. సీజన్‌ ప్రారంభంలోనే మద్దతు ధరను మించి లభిస్తుండ డంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెల్ల ‘బంగారం’.. జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.9,200
Jammikunta, Cotton Price

  • మద్దతు ధరకు మించి పలుకుతున్న ధరలు..

  • సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

జమ్మికుంట(కరీంనగర్): పత్తి రైతులకు ఈ ఏడాది ధరలు ఊరటనిస్తున్నాయి. సీజన్‌ ప్రారంభంలోనే మద్దతు ధరను మించి లభిస్తుండ డంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం క్వింటాల్‌ పత్తికి గరిష్ఠంగా 9,200 రూపాయల ధర పలికింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో గత సీజన్‌లో సీసీఐ క్వింటాల్‌కు 8,110 మద్దతు ధర చొప్పున 10,666 మంది రైతుల నుంచి 1,45,057 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ప్రైవేటు వ్యాపారులు 1,18,638 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది పత్తికి ప్రభుత్వం క్వింటాల్‌కు 8,667 రూపా యలు మద్దతు ధర నిర్ణయించగా, మార్కెట్‌లో అంతకుమించి ధరలు పలుకుతున్నాయి.


  • రూ. 8,600 నుంచి ప్రారంభమై..

సెప్టెంబరు23 నుంచి కొత్త పత్తి మార్కెట్‌కు రావడం ప్రారంభమైంది. తొలి రోజుల్లో క్వింటాల్‌కు రూ.8600 వరకు ధర పలకగా.. రోజులు గడుస్తున్న కొద్దీ పత్తి నాణ్యత పెరగడం, వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.ఈ సీజన్‌లో మార్కెట్‌కు ఇప్పటివరకు 2,500 క్వింటాళ్ల పత్తి వ చ్చింది. మంగళవారం జమ్మికుంట వ్యవ సాయ మార్కెట్‌కు సుమారు 150 వాహ నాల్లో 690 క్వింటాళ్ల పత్తి రాగా, గరిష్ఠ ధర 9,200, మోడల్‌ ధర 8,900, కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు లభించింది.


jmt1.2.jpg10 క్వింటాళ్లకు 9,200, వంద క్వింటాళ్లకు 8,900, 580 క్వింటాళ్లకు ఎనిమిది వేల నుంచి 8,800 వరకు ధర లభించింది. ఈసారి ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ముందస్తు ఏర్పాట్లు చేసినా.. ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. గతంలో ప్రైవేటు వ్యాపారుల కంటే సీసీఐ మద్దతు ధర ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రభుత్వ కొను గోలు కేంద్రాల వైపు మొగ్గు చూపేవారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మద్దతు ధర కంటే ప్రైవేటు వ్యాపారులు అధికంగా చెల్లిస్తుండడంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు.


సహోదర్‌రెడ్డి సైదాపూర్‌ మండలం గుజ్జులపల్లికి చెందిన రైతు. ఈసారి మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. మొదటి విడత పత్తి ఏరడంతో 10 క్వింటాళ్లు వచ్చింది. మంగళవారం జమ్మికుంట మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చాడు. పత్తి నాణ్యంగా ఉండడంతో వ్యాపారులు క్వింటాల్‌కు 9,200 రూపాయలు పెట్టారు. మద్దతు ధరకంటే ఎక్కువ రావడంతో రైతు సహోదర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు.. ధర ఇదే విధంగా ఉంటే రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 12:12 PM