ఉప్పల్లో భారత్ Vs వెస్టిండీస్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందాపై పోలీసుల కొరడా
ABN , Publish Date - Oct 14 , 2026 | 10:58 AM
భారత్ Vs వెస్టిండీస్ నాలుగో T20 మ్యాచ్ బుధవారం జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర 2,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, క్రికెట్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): భారత్ Vs వెస్టిండీస్ నాలుగో T20 మ్యాచ్ ఈరోజు (బుధవారం) జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర 2,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, క్రికెట్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న నలుగురు నిందితులు అవినాశ్, దరఖ్, మోహిత్, సోమానిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఆ తర్వాత కాచిగూడకు చెందిన ఆకర్షిత్ శ్రీవాత్సవ, నింబోలి అడ్డాకు చెందిన సతీశ్ చంద్ర శ్రీవాత్సవను అదుపులోకి తీసుకున్నారు.
తొలుత ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల అక్రమ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బేగంబజార్లోని ఎస్ఓ మాల్లో గోషామహల్ పోలీసులు తనిఖీలు చేశారు. నాట్ ఫర్ సేల్ అని ఉన్న కాంప్లిమెంటరీ టికెట్లను విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల దగ్గరి నుంచి 5 సెల్ఫోన్లు, 11 క్రికెట్ మ్యాచ్ టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ కారిడార్కు ఆమోదం
హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్రావు సంచలన ఆరోపణలు
హైదరాబాద్లో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News