Share News

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:04 AM

హైదరాబాద్‌లో మరో 70 వేల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా 70 వేల ఫారం-6 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు.

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!
Hyderabad New Voters

  • ఓటర్‌ నమోదుకు 2.18 లక్షల దరఖాస్తులు

  • వాటిల్లో 70 వేలు ఆమోదం, 14,267 తిరస్కరణ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మరో 70 వేల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా 70 వేల ఫారం-6 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదుకు మొత్తం 2.18 లక్షల ఫారం-6 దరఖాస్తులు జీహెచ్‌ఎంసీకి అందాయి. ఇందులో అత్యధికంగా బహదూర్‌పురా నియోజకవర్గం నుంచి 33,026, అత్యల్పంగా సనత్‌నగర్‌లో 5,781 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 70వేలు ఆమోదం పొందగా, 1.33 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 14,267 దరఖాస్తులను తిరస్కరించారు. ప్రవాస భారతీయ ఓటర్లకు సంబంధించి 4,589 దరఖాస్తులు రాగా 529 అమోదించారు.


ఇక, చిరునామా మార్పు/సవరణ కోసం 1.62 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిల్లో 1.19 లక్షలు ఆమోదించామని, 17,986 దరఖాస్తులను తిరస్కరించామని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ వివరించారు. ముసాయిదా జాబితా ప్రకారం 27.95 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 12.54 లక్షల మందికి నో మ్యాపింగ్‌, ఎనామలిస్‌ పేరిట నోటిసులిచ్చారు. వీరిలో 11.01 లక్షల మంది విచారణ (హియరింగ్‌)కు హాజరైనట్టు తెలిపారు. 1.39 లక్షల ఓటర్ల విచారణ పెండింగ్‌లో ఉందన్నారు. సర్‌ షెడ్యూల్‌ ప్రకారం ఓటరు తుది జాబితా నవంబరు 9న ప్రకటించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి

భద్రతా ఫీచర్ల పేపర్‌తో కొత్త ‘మీ-సేవ’ సర్టిఫికెట్‌

రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారింది

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 06:04 AM