Share News

రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారింది

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:49 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ శ్రేణులు సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు పేర్కొన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారింది
Ramchander Rao

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ శ్రేణులు సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా రాహుల్‌ గాంధీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ గేట్‌ వద్ద చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆయన న్యాయవాది హోదాలో పాల్గొన్నారు.


న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు న్యాయవాద లోకమంతా ఏకతాటిపైకి వచ్చిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై రాజకీయాలకు అతీతంగా గౌరవం కలిగి ఉండాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజకీయ విజ్ఞప్తులు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు, జస్టిస్‌ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని కేరళం కాంగ్రెస్‌ పోస్టులు పెడుతూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం న్యాయవ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని ఆయన మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవీఎస్‌ రాజు కన్నుమూత

రైతు డిస్కమ్‌ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే కుట్ర: హరీశ్‌

సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనం!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:50 AM