Share News

రైతు డిస్కమ్‌ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే కుట్ర: హరీశ్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:46 AM

వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరాకు మొత్తంగా ఎసరు పెట్టేందుకు రైతు డిస్కమ్‌ పేరుతో కుట్రలు చేస్తున్నారని, రైతు మెడకు ఉరివేసేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు ఆరోపించారు.

రైతు డిస్కమ్‌ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే కుట్ర: హరీశ్‌
Harish Rao

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరాకు మొత్తంగా ఎసరు పెట్టేందుకు రైతు డిస్కమ్‌ పేరుతో కుట్రలు చేస్తున్నారని, రైతు మెడకు ఉరివేసేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు ఆరోపించారు. పంటలు ఎండిపోయి అన్నదాత కన్నీరు పెడుతుంటే.. రైతు డిస్కం పేరిట రేవంత్‌ సర్కారు రాజకీయ చదరంగం ఆడుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు డిస్కమ్‌ ఏర్పాటుచేస్తూ జీవో-17 జారీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే కరెంట్‌ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టనుందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. జల విద్యుత్తు పవర్‌ మొత్తం రైతు డిస్కమ్‌కే కేటాయించార ని, ఈ హైడల్‌ పవర్‌ సాంకేతికంగా ఏడాదిలో 3-4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని, మిగతా 8నెలలు రైతు డిస్కమ్‌కి ఈ విద్యుత్తు అందుబాటులో ఉండదని, అప్పుడు ఎలా నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రైతు డిస్కమ్‌ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆర్థిక భారం, సిబ్బంది నిర్వహణపై పూర్తి వివరాలు వెల్లడించాలని, లేదంటే తక్షణం జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవీఎస్‌ రాజు కన్నుమూత

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనం!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:46 AM