సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:32 AM
దసరా పండుగ సందర్భంగా సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన రూ.1754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం (అంటే రూ. 596 కోట్లను).. సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు పండుగ బోన్సగా ఇస్తామని ప్రకటించింది.
గరిష్ఠంగా రూ.లక్షన్నరకు పైగా.. కాంట్రాక్ట్ సిబ్బందికి 5,500 చొప్పున!
సంస్థ లాభాలు రూ.1754 కోట్లు
అందులో 34 శాతం.. 596 కోట్లు కార్మికులకు బోన్సగా ఇస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణిని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ఇప్పుడు సాధించేందేంటి?: మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా సింగరేణి బొగ్గు గని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన రూ.1754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం (అంటే రూ. 596 కోట్లను).. సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు పండుగ బోన్సగా ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో కార్మికులకు గరిష్ఠంగా రూ.1,53,912 మేర బోన్సగా అందనుందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం ప్రజాభవన్లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణిలోని 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. అలాగే.. 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు కూడా ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున దసరా బోనస్ చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సొంతింటి కలను సాకారం చేయడానికి వీలుగా ఇప్పటి వరకూ మైనింగ్ చేపట్టని ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువుగా లే-అవుట్లు సిద్ధం చేసి, జవహర్ లాల్ నెహ్రూ పేరిట హౌసింగ్ కాలనీ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు భట్టి సూచించారు. సింగరేణి నుంచి రెవెన్యూ శాఖకు అప్పగించిన భూముల్లో దాదాపు 1250 ఎకరాల్లో.. అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించినట్టు తెలిపారు.
సింగరేణిలో పెండింగ్లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లు, ఇతర చట్టపరమైన ప్రక్రియలను 15 రోజుల్లో పూర్తి చేసి అరు?లైన అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేయాలని ఆదేశించినట్టు చెప్పారు. పేర్ల మార్పులకు సంబంధించి పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా ఒకరోజు మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. సింగరేణి ఉద్యోగులకు చెల్లిస్తున్నట్టే కార్మికుల పెర్క్స్, అలవెన్స్లపై ఆదాయపన్నును కూడా సంస్థ తరఫున ప్రభుత్వానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు.
ప్రతి గ్రామంలో క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంపులు
బొగ్గు గనులు, ఓవర్ బర్డెన్ డంప్ల దుమ్ము వల్ల ప్రజల ఆరోగ్యం ప్రభావితమవుతున్న నేపథ్యంలో.. సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని భట్టి తెలిపారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాక్లను అదనంగా సాధించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాగా.. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉండి సింగరేణిని నిర్వీర్యం చేసి, భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోరుబాట పేరుతో ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యకు ’గురూజీ‘ వల
పదికి మించి ఫారం-7 దరఖాస్తులు కుదరదు
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International