Share News

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భార్యకు ’గురూజీ‘ వల

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:27 AM

ఆధ్యాత్మికత పేరిట మహిళకు అసభ్య సందేశాలు పంపుతూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాపురంలో చిచ్చు పెట్టడమే కాకుండా, ప్రశ్నించినందుకు చంపేస్తానని బెదిరించిన ఘటనలో ‘శ్రీ చైతన్య గురూజీ‘ అలియాస్‌ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ భార్యకు ’గురూజీ‘ వల
Sri Chaitanya Guruji Case

  • నిరంతరం అసభ్య సందేశాలు, వ్యక్తిగత సంభాషణ

  • ఆమె భర్త ప్రశ్నిస్తే.. చంపేస్తానని బెదిరింపులు

  • శ్రీచైతన్య గురూజీపై బీఎన్‌ఎ్‌స 351(2)సెక్షన్‌ కింద కేసు

బంజారాహిల్స్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికత పేరిట మహిళకు అసభ్య సందేశాలు పంపుతూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాపురంలో చిచ్చు పెట్టడమే కాకుండా, ప్రశ్నించినందుకు చంపేస్తానని బెదిరించిన ఘటనలో ‘శ్రీ చైతన్య గురూజీ‘ అలియాస్‌ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10, స్రవంతి నగర్‌కు చెందిన కె. విష్ణుదీ్‌పరెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.71లోని శ్రీవిద్యా సాధనా సెంటర్‌కు అతని భార్య వెళ్తూ ఉండేది. సెంటర్‌ నిర్వాహకుడు మేరెడ్డి సునీల్‌రెడ్డి ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు.


నిరంతరం అసభ్య సందేశాలు, వ్యక్తిగత సంభాషణలు జరుపుతుంటాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త విష్ణుదీ్‌పరెడ్డి సదరు కేంద్రానికి వెళ్లి నిలదీయగా.. అతడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ జీవితాన్ని నాశనం చేస్తానని, మళ్లీ ఇటువైపు వస్తే చంపేస్తానని బెదిరించినట్లు విష్ణుదీ్‌పరెడ్డి కోర్టులో వేసిన పిటిషిన్‌లో పేర్కొన్నాడు. తమ వైవాహిక జీవితంలో తీవ్ర గందరగోళం సృష్టించాడని, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు, చాటింగ్‌లతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అనుమతితో జూబ్లీహిల్స్‌ పోలీసులు.. గురూజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్‌ను ఈసీ గెలిపించాలా?

పదికి మించి ఫారం-7 దరఖాస్తులు కుదరదు

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:27 AM