Share News

పదికి మించి ఫారం-7 దరఖాస్తులు కుదరదు

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:13 AM

సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించాలని కోరుతూ సమర్పించే ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీఐ) రంగంలోకి దిగింది.

పదికి మించి ఫారం-7 దరఖాస్తులు కుదరదు
ECI Form 7 Rules

  • ఫిర్యాదులు తప్పని తేలితే కఠిన చర్యలుంటాయి

  • దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ ఈసీ నిబంధనలు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించాలని కోరుతూ సమర్పించే ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీఐ) రంగంలోకి దిగింది. కొందరు వ్యక్తులు సరైన ఆధారాల్లేకుండా, నిరాధారమైన కారణాలతో పెద్ద ఎత్తున ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తున్నట్లు ఈసీ దృష్టికి రావడంతో ఈసీఐ ప్రత్యేక నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సహా సర్‌ ప్రక్రియ కొనసాగుతున్న అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీఐ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకే వ్యక్తి గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తు పత్రాలను సమర్పించడం తగదని.. ఎస్‌ఐఆర్‌ సమయంలో ఒక వ్యక్తి పది ఫారం-7 దరఖాస్తులు సమర్పించడానికే అనుమతి ఉంటుందని తెలిపింది.


నిరంతర ఓటరు జాబితా సవరణ కాలంలో: సాధారణ సమయాల్లో 5 దరఖాస్తులు మాత్రమే పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. ఏ మార్గంలోనైనా ఈ పరిమితులు కచ్చితంగా వర్తిస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. ఫారం-7 దరఖాస్తులను సమర్పించే వారు సరైన వివరాలు నింపి, స్వయంగా సంతకం చేయాలని, సంతకానికి బదులుగా సీల్స్‌ లేదంటే.. స్టాంపులను ఉపయోగించడం చెల్లదని, ఆ దరఖాస్తుదారుల ప్రామాణికతను ఓటరు జాబితాతో సరిపోల్చి ఈఆర్‌వోలు పరిశీలించాలని పేర్కొంది. ఒకవేళ ఫారం-7 దరఖాస్తులు, ఫిర్యాదులు తప్పు.. బూటకమని తేలితే.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలు చేసిన దరఖాస్తుదారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 సెక్షన్‌-31 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈసీఐ ఆదేశాలను ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు తప్పకుండా పాటించాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందిపై అనవసర పనిభారాన్ని తగ్గించేందుకు నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఎన్నికల సంఘం ఈ నిబంధనలను తెచ్చినట్లు సీఈవో వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్‌ను ఈసీ గెలిపించాలా?

ఎమ్మెల్సీ బరిలో మళ్లీ రాంచందర్‌రావు?

జనవరిలో విజయవాడ హైవే విస్తరణ

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:13 AM