Share News

సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:55 AM

జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.59 వేల కోట్లకు చేరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అగ్రహం వ్యక్తం చేసింది.

సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి
Singareni Dues

  • విద్యుత్‌ సౌధ ముందు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ధర్నా

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.59 వేల కోట్లకు చేరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు తక్షణమే విడుదల చేయకపోతే ఆ విద్యుత్‌ సంస్థలకు బొగ్గు సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది. అవసరమైతే బొగ్గు బావుల వద్దే ఆందోళనకు దిగి ఉత్పత్తిని స్తంభింపచేస్తామంది. ఈ డిమాండ్‌తో మంగళవారం ఇక్కడ సోమాజిగూడలోని విద్యుత్‌ సౌధ ఎదుట ‘ఛలో హైదరాబాద్‌’ పేరిట సింగరేణి కార్మికులు ధర్నా నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవీఎస్‌ రాజు కన్నుమూత

రైతు డిస్కమ్‌ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే కుట్ర: హరీశ్‌

రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారింది

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 05:55 AM