Share News

భద్రతా ఫీచర్ల పేపర్‌తో కొత్త ‘మీ-సేవ’ సర్టిఫికెట్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:59 AM

‘మీ- సేవ’ సర్టిఫికెట్లను జారీ చేయడానికి 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కూడిన సెక్యూరిటీ పేపర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

భద్రతా ఫీచర్ల పేపర్‌తో కొత్త ‘మీ-సేవ’ సర్టిఫికెట్‌
Duddilla Sridhar Babu

  • మన్నికతోపాటు 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లు

  • ప్రజాభవన్‌లో ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘మీ- సేవ’ సర్టిఫికెట్లను జారీ చేయడానికి 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కూడిన సెక్యూరిటీ పేపర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా నకిలీ సర్టిఫికెట్లు, అనధికారిక నకళ్లను అరికట్టేందుకు వీలవుతుంది. దీన్ని నీళ్లలో పడి తడిసినా చెడిపోకుండా, దెబ్బ తినకుండా రూపొందించారు. ప్రజా భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కొత్త సెక్యూరిటీ పేపర్‌తో ‘మీ-సేవ’ సర్టిఫికెట్‌ విధానాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ విధానాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. జనన, మరణ ధ్రువపత్రాలతోపాటు విద్య, ఉద్యోగ అవకాశాలు, తదితర అవసరాలకోసం వినియోగించే సర్టిఫికెట్లు ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనవని, వాటిలో కొన్నింటిని జీవితాంతం భద్ర పరుచుకోవాల్సి ఉంటుందన్నారు. అటువంటి ధ్రువపత్రాలు త్వరగా పాడవకుండా చూడటంతోపాటు వాటి విశ్వసనీయత పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సింగరేణికి రూ.59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి

రైతు డిస్కమ్‌ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరుపెట్టే కుట్ర: హరీశ్‌

రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారింది

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 06:00 AM