Share News

17న అక్కడక్కడ భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:26 AM

ఒకవైపు నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో దక్షిణ భారతంలో వర్షాలు ప్రారంభం కావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

17న అక్కడక్కడ భారీ వర్షాలు
Telangana Heavy Rain Forecast

  • ఎల్లో అలెర్ట్‌ జారీ..

  • 15-19 వరకు తేలికపాటి వానలు

హైదరాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఒకవైపు నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో దక్షిణ భారతంలో వర్షాలు ప్రారంభం కావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈనెల 17న రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్‌ను ఈసీ గెలిపించాలా?

పదికి మించి ఫారం-7 దరఖాస్తులు కుదరదు

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 14 , 2026 | 06:26 AM