Share News

సింగరేణి ఉద్యోగులకు ‘లాభాల’ పంట

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:56 AM

సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు లాభాల బోనస్‌ పొందనున్నారు.

సింగరేణి ఉద్యోగులకు ‘లాభాల’ పంట
Singareni Bonus

  • భూపాలపల్లి ఏరియాలో 8,722 మందికి బోనస్‌

కాకతీయఖని(భూపాలపల్లి): సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు లాభాల బోనస్‌ పొందనున్నారు. దీంతో భూపాలపల్లి ఏరియాలో హర్షం వ్యక్తమవుతోంది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సంస్థ లాభాల్లో 34శాతం వాటాగా పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏరియాలో పనిచేస్తున్న 5,522మంది పర్మనెంట్‌ ఉద్యోగులకు, 3200మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 8,722 మందికి లాభాల వాటా దక్కనుంది. ఈసారి పర్మనెంట్‌ ఉద్యోగులకు రూ. 1.54 లక్షల వరకు, కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ. 5500 వరకు బోనస్‌ ఇవ్వనున్నట్టు సింగరేణి సంస్థ వెల్లడించింది.


hnk2.2.jpg

hnk2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 10:56 AM