పాక్లో లష్కర్ టాప్ కమాండర్ హత్య?
ABN , Publish Date - Oct 14 , 2026 | 09:53 AM
పాక్లో తాజాగా పట్టపగలు జరిగిన ఓ హత్య కలకలం రేపుతోంది. మృతుడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అన్న వార్తలు స్థానిక సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: పాక్లో తాజాగా పట్టపగలు జరిగిన ఓ హత్య కలకలం రేపుతోంది. మృతుడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అన్న వార్తలు స్థానిక సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే, ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దాడికి సంబంధించిన వీడియో కూడా ట్రెండింగ్లోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగినట్టు సమాచారం.
ఓ భవనం నుంచి ఆ వ్యక్తి బైక్పై బయటకు వస్తుండగా ఈ దాడి జరిగింది. అకస్మాత్తుగా బైకర్కు ఎదురుపడ్డ నిందితుడు అతడిపై పదే పదే కాల్పులు జరిపాడు. బైకర్ అతడిని తప్పించుకునే ప్రయత్నంలో బైక్పై నుంచి పడిపోయాడు. ఈ క్రమంలో నిందితుడు పలుమార్లు కాల్పులు జరిపాడు. తన వద్ద ఉన్న మరో తుపాకీతో కూడా కాల్పులు జరిపాడు. చివరకు విజయోత్సాహం ప్రదర్శిస్తున్నట్టు చేతులు పైకెత్తాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బైకర్ మాత్రం అక్కడే కుప్పకూలిపోయాడు.
ఆ బైకర్ లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఇమ్రాన్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అతడు ఐఎస్ఐ సీక్రెట్ ఏజెంట్ అయి ఉంటాడని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కూడా ఇంకా నిర్ధారణ కాలేదు.
మృతుడు ఎవరో పాక్ మిలిటరీ అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. ఘటనపై విచారణ ప్రారంభమైందా? లేదా? అనే అంశంపై కూడా స్పష్టత లేదు. దీంతో, ఈ ఉదంతంపై పాక్లో సస్పెన్స్ నెలకొంది.
ఈ వార్తలనూ చదవండి:
సౌదీ ఇంధన దిగ్గజం అరాంకో ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి
ఎగ్జిక్యూటివ్ రూమ్లో సీక్రెట్ మైక్.. ఓపెన్ఏఐ ఇంజినీర్ అరెస్ట్