Share News

ఉప్పల్‌లో నయా పిచ్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:30 AM

పదిహేనేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియం పిచ్‌ భవితవ్యం మారింది. కాంట్రాక్టర్లు, హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల జేబులు నింపే పనులు కాకుండా తొలిసారి మైదానానికి ఉపయోగపడే పనులను హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం చేపట్టింది.

ఉప్పల్‌లో నయా పిచ్‌
Uppal Stadium

  • 15 ఏళ్ల తర్వాత సరికొత్తగా..

  • స్టేడియానికి కొత్త హంగులు

  • రూ.5 కోట్ల వ్యయంతో మరమ్మతులు పూర్తి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): పదిహేనేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియం పిచ్‌ భవితవ్యం మారింది. కాంట్రాక్టర్లు, హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల జేబులు నింపే పనులు కాకుండా తొలిసారి మైదానానికి ఉపయోగపడే పనులను హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం చేపట్టింది. బుధవారం జరిగే భారత-వెస్టిండీస్‌ నాలుగో టీ20 మ్యాచ్‌ కోసం క్యురేటర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలోని ఉప్పల్‌ స్టేడియం గ్రౌండ్స్‌మన్‌ పూర్తిగా కొత్త పిచ్‌ను తయారు చేశారు.


ఇందుకోసం హెచ్‌సీఏ సుమారు రూ.50లక్షలు వెచ్చించింది. టీజీ20 లీగ్‌ ఆరంభ వేడుకల సమయంలో విద్యుత్‌ వైరింగ్‌ సమస్యతో ఫ్లడ్‌లైట్లు దాదాపు 20 నిమిషాలు నిలిచిపోవడం తెలిసిందే. ఇరవై ఏళ్ల నుంచి వైరింగ్‌ మార్చకపోవడంతో ఏర్పడిన ఈ సమస్యను పరిష్కరించడానికి దాదాపు రూ.3 కోట్లను హెచ్‌సీఏ ఖర్చు చేసి స్టేడియం ఆవరణలోని వైరింగ్‌ మొత్తాన్ని కొత్తగా వేసింది.


zzz.jpgస్టేడియం భద్రతా ప్రమాణాల్లో అత్యంత ముఖ్యమైన ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థను కూడా పూర్తిగా ఆధునికీకరించారు. వీటన్నింటికి కలిపి సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్టు హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి, వెన్యూ మేనేజర్‌ సంజీవ్‌ రెడ్డి తెలిపారు. ఇక, ఈ టీ20 పోటీలో తెలుగు క్రికెటర్లు తిలక్‌వర్మ, నితీశ్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.


ఎర్ర, నల్ల మట్టి మిశ్రమంతో..

ఉప్పల్‌ స్టేడియంలో సహజంగా ఎర్ర మట్టితోనే పిచ్‌ను సిద్ధం చేస్తారు. దీంతో బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంటుంది. ఐపీఎల్‌లో నమోదైన భారీ స్కోర్లే ఇందుకు నిదర్శనం. 2024 బంగ్లాదేశ్‌తో టీ20లో భారత్‌ 297 పరుగులు చేసింది. ఈ స్టేడియంలో టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే, ఈసారి మిశ్రమ మట్టితో పిచ్‌ను తయారు చేయడంతో బ్యాటర్లు, బౌలర్లకు ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 09:33 AM