Share News

శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:26 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.

శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు
Vijayawada Maha Chandi Devi Darshan

విజయవాడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు (బుధవారం) శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దేవిని దర్శించుకునేందుకు ఇవాళ ఉదయం నుంచి క్యూ లైన్‌లో భక్తులు బారులు తీరారు. ఆలయానికి భక్తులు బారీగా తరలి రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘జై దుర్గా .. జై జై దుర్గా’ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్భవించిందని పండితులు తెలిపారు.


శ్రీ మహాచండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువై ఉన్నారని పండితులు వివరించారు. దేవిని పూజిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు.. మిత్రులుగా మారుతారని తెలిపారు. ఏ కోరికలకోసం అయితే దేవిని ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు. ఈరోజు శ్రీ మహాచండీ అలంకరణలో ఉన్న అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపదిముర్మ దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ఆలయానికి రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కూటమిలో ఎన్నికల హడావుడి.. సీట్ల సర్దుబాటుపై చర్చలు

అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్గ్‌గా నామకరణం చేశాం: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 08:30 AM