ఆమ్రపాలి క్యాడర్ వివాదంపై విచారణ పూర్తి
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:40 AM
సీనియర్ ఐఏఎస్ కాట ఆమ్రపాలి క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
సీనియర్ ఐఏఎస్ కాట ఆమ్రపాలి క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో తలెత్తిన ఈ క్యాడర్ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు తన తీర్పును రిజర్వు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తనను తెలంగాణ క్యాడర్కే కేటాయించాలంటూ ఆమ్రపాలి గతంలో క్యాట్ను ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
అయితే, క్యాట్ ఇచ్చిన ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. క్యాట్ ఆదేశాలపై గతంలో స్టే విధించింది. స్టేను ఎత్తివేయాలన్న ఆమ్రపాలి పిటిషన్పై.. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ భట్టాచార్య, జస్టిస్ రేణుక ధర్మాసనం తాజాగా తీర్పును రిజర్వు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International