ఎల్నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:37 AM
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా హైదరాబాద్ కోర్ ఏరియాలో ముందస్తు చర్యలు చేపట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా హైదరాబాద్ కోర్ ఏరియాలో ముందస్తు చర్యలు చేపట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ... ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధుల్లో తాగునీటి సరఫరా సన్నద్ధతపై మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎల్నినో ప్రభావంతో రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గినప్పటికీ... అందుబాటులోని నీటి వనరులను సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, మంజీరా, కృష్ణా, గోదావరి నదుల నుంచి ప్రస్తుతం 560 ఎంజీడీల నీటి లభ్యత ఉందని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్యకు ’గురూజీ‘ వల
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International