పూలసాగు.. భలే బాగు..
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:36 AM
వ్యవసాయ రంగంలో ప్రతియేటా రైతన్న నష్టాల బాటలోనే నడుస్తున్నాడు. ఏ పంట సాగు చేసినా ఏదో ఒక విధంగా పంటలు నష్టపోతు ఆర్ధికంగా అప్పుల పాలవుతున్నాడు.
పరకాల, నడికూడ మండలాల్లో 30 ఎకరాల్లో సాగు
లాభాల బాటలో రైతులు
పరకాల(వరంగల్): వ్యవసాయ రంగంలో ప్రతియేటా రైతన్న నష్టాల బాట లోనే నడుస్తున్నాడు. ఏ పంట సాగు చేసినా ఏదో ఒక విధంగా పంటలు నష్టపోతు ఆర్ధికంగా అప్పుల పాలవుతున్నాడు. అయినప్పటికీ దేశానికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా అప్పులు అయినా వ్యవసాయాన్ని మరువకుండా మూ ములు దున్నుతూ పంటలు పండిస్తున్నాడు. ఈ ఏడాది అడప దడపా కురిసిన వర్షాలు కొంత మేర కు రైతులు పత్తి, మిర్చి, వరి సాగు చేస్తే కొద్దిగొ ప్పో రైతులు వర్షాలు కురవడం లేదని ఆలోచన చేసి మూడు నెలల్లో పంట చేతికొస్తే పూలసాగు చేశారు.
దానికి తోడు బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా, దీపావళి పండగలు వరుసగా రావడంతో పూలకు భలే గిరాకీ లభిస్తోంది. గొద్దిగొప్పో సాగు చేసిన రైతులకు కూడా మంచి లాభాలే వస్తున్నాయి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు వస్తుం డడం తో బంతి, పూలజడ సాగు చేసిన రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. విత్తనాల కొనుగోలుతోపాటు దుక్కిదున్నడం, కలుపు కూళ్లు, ఎరువులు, పిచికారి మందులు అన్ని కలుపుకొని రూ. 40 వేల పెట్టు బడి పెట్టడంతో తక్కువ కాలం మూడునెలల్లో చేతి కి వస్తున్నాయి.
ఎంగిలిపూల బతుకమ్మ రోజు హోల్సేల్గా పోసిన రైతులు రూ. 80 కిలోకు అమ్మకాలు చేశారు. రిటేల్గా రూ. 100 నుంచి రూ. 150 వరకు అమ్మకాలు జరుపడంతో కొందరు రైతు లు తమ భూముల వద్ద రోడ్లపై ఇరువైపులా పూ లను పోసి రూ. 100 అమ్మకాలు నిర్వహి స్తు న్నా రు. ఎకరం భూమిలో పూల సాగు చేస్తే రూ. 1 లక్షా 50వేల వరకు దిగుబడి వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు.
ప్రతియేటా రైతులు పంట మార్పిడి లేకుండానే పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తున్నారు. అందులో నష్టం వచ్చినా కూడా నష్టపోయామని చెప్పడమే తప్పా పంట మార్పిడి చేయడం లేదు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక పోవడంతో కొద్దిగొప్పో రైతులు పూలసాగు చేసి అధిక దిగుబడులు సాధించడంలో తోటి రైతులు కూడా మేము కూడా సాగు చేస్తే బాగుండు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కష్ట పడి పంటలు సాగు చేస్తే దిగుబడి సమయంలో ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో పత్తి పంట పూత, కాత దశలో వర్షానికి తడిసి రాలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నల్లగుంజర రోగాలు వచ్చి పత్తి ఎక్కడికక్కడ మొక్కలు చనిపోతూ తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏది ఏమైనా ఈ ఏడాది పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల కంటే పూలసాగు చేసిన రైతులకే లాభాలు వచ్చాయి.
వర్షాలు లేక పూలసాగు చేశా..
జంగిలి రాజు రైతు, పరకాల
ప్రతియేటా పత్తి, మిర్చి పంటలు సాగు చేసేది, సరైన వర్షాలు పడకపోవడంతో సాగునీటికి ఇబ్బంది అవుతుందని ఈ ఏడాది చూద్దామని బంతి పంటను 20 గుంటల్లో సాగు చేశాను. రూ. 70 నుంచి రూ. 80 ఆదాయం సమ కూరింది. దీపావళి పండగ వరకు పూల అమ్మ కాలు చేసుకునే విధంగా పంట సాగు చేశాను. పూలసాగుతో ఎలాంటి నష్టం జరగలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News