Share News

పట్టభద్ర ఓటర్లు 6,21,086

ABN , Publish Date - Nov 26 , 2026 | 11:50 AM

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో తొలి ఘట్టం పూర్తయింది.

పట్టభద్ర ఓటర్లు 6,21,086
Graduate MLC Election

  • ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

  • డిసెంబరు 10 వరకు నమోదుకు అవకాశం

  • 2024 కంటే 1.57 లక్షల అదనపు ఓట్లు నమోదు

  • డిసెంబరు 20న తుది జాబితా తర్వాత షెడ్యూల్‌ వచ్చే అవకాశం

  • 29 మార్చితో ముగియనున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న పదవీకాలం

  • ఇక షురువు కానున్న ప్రచార పర్వం

నల్లగొండ: శాసనమండలి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో తొలి ఘట్టం పూర్తయింది. ఎన్నికల సంఘం బుధవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం 6,21,086 ఓట్లు నమోదయ్యాయి. 2024లో జరిగిన ఉప ఎన్నికలో 4,63,839 ఓట్లు మాత్రమే ఉండగా, ఈసారి ప్రధాన రాజకీయపక్షా లు ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో గణనీయంగా పెరిగింది. 2024తో పోల్చితే 1,57,247 ఓట్లు అదనంగా నమోద వడం విశేషంగా చెప్పవచ్చు. ముసాయిదా జాబితాపైన డిసెంబరు 10వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. డిసెంబరు 25లోగా వీటిని పరిష్కరిస్తారు. అనంతరం డిసెంబరు 30న తుదిజాబితా ప్రకటిస్తారు. డిసెంబరు 10వ తేదీవరకు ఓటర్ల నమోదు కూడా సమాంతరంగా కొనసాగుతూనే ఉంటుందని ఎన్నికల సం ఘం రాష్ట్ర ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. మరోవైపున ఈఎన్నికపై ప్రత్యేకంగా కన్నేసిన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు ఓటర్లనమోదుపై దృష్టిసారించ గా, ఇక ప్రచారపర్వం మొదలు పెట్టనుండడంతో డిసెంబరు నుంచి గ్రాడ్యుయేట్ల ఓటర్ల ప్రచారహోరు ఊపందుకోనుంది.


6,21,086 మంది ఓటర్ల నమోదు

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని 192 మండలాల్లో విస్తరించిన ఈ శాసనమండలి నియోజకవర్గం లో 894 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. బుధవారం ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం 6,21,086 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో 3,73,984 మంది పురుషు లు, 2,47,095 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు నమోదయ్యారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 1,07,003 మంది ఓటర్లు నమోదవగా, ఆతర్వాత ఖమ్మం జిల్లాలో 1,01,671 మంది నమోదు చేసుకున్నారు. అత్యల్పంగా సిద్ధిపేటలో 6,392, ములుగులో 14,204మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలో పరిధిలోని ఈ నియోజకవర్గంలో 2024లో జరిగిన ఉపఎన్నిక సందర్భంలో 4,63,839 ఓట్లు ఉండగా, తాజాగా వాటిసంఖ్య గణనీయంగా పెరిగి 6,21,086కు చేరింది. ఓటర్ల నమోదులో రాజకీయపార్టీలు ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించి ప్రోత్సహించడంతో ఓటర్ల సంఖ్య పెరిగింది.


hnk3.3.jpgమార్చి 29తో ముగియనున్న పదవీకాలం

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మె ల్సీ తీన్మార్‌ మల్లన్న పదవీకాలం 29 మార్చి 2027తో ముగియనుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాల రూపకల్పన కొలిక్కిరాగా, డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనుండడంతో ఆతర్వాత ఏక్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని భావిస్తున్నారు. 2007లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో కపిలవాయి దిలీ్‌పకుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తీన్మా ర్‌ మల్లన్న ప్రాతినిథ్యం వహించగా, ఈసారి జరిగే ఎన్నికల్లో పూర్తిగా పోటాపోటీ కనిపిస్తోంది.


రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు

రాజకీయంగా చైతన్యవంతమైన నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లా ల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో విద్యావంతుల అభిప్రాయం ఈ ఎన్నిక ద్వారా తెలియనుండడంతో అధికార కాంగ్రె్‌సతో పాటు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, తెలంగాణ రాజ్యాధికారపార్టీలు గెలుపుకోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగే ఎన్నిక కావడం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లను అందించడంలో కీలకమైన భూమిక పోషించిన ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ ఎన్నిక జరగనుండడంతో కాంగ్రె్‌సకు ఈ స్థానం ప్రతిష్ఠాత్మకంగా మారిందని చెప్పవచ్చు. మరోవైపున ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైతం ఈ నియోజకవర్గంపై దృష్టిసారించాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అందరికంటే ముందే అభ్యర్థి గా ప్రకటించింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తనయుడైన సర్వోత్తమ్‌రెడ్డి ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్‌ కీలకనేతలందరినీ కలిసి మద్దతు ఆశించడంతో పాటు, ఓటర్ల నమోదుపైనా ప్ర త్యేకంగా శిబిరాలు నిర్వహించారు.


బీఆర్‌ఎస్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఏనుగుల రాకేష్ రెడ్డి మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనా, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ సైతం ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్రమత్తమైంది. ఇంకోవైపున ఇదేస్థానం నుంచి 2024 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో గెలిచిన తీన్మార్‌మల్లన్న.. తాను స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి 2024 ఉప ఎన్నికల్లో బలమైన ఓట్లు సాధించి నాలుగోస్థానంలో నిలిచిన పాలకూరి అశోక్‌ కుమార్‌గౌడ్‌ని అభ్యర్థిగా ప్రకటించడంతో గట్టి పోటీకి సిద్ధమయ్యారు. పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యాయసంఘ కీలకనేత సుంకరిభిక్షంగౌడ్‌ను పీఆర్‌టీయూ తమ అభ్యర్థిగా ప్రకటించింది.


బీజేపీ సైతం భిక్షంగౌడ్‌కు మద్దతునిచ్చే అంశంపై పార్టీలో అంతర్గత అభిప్రాయసేకరణ జరపగా, సానుకూలత వ్యక్తమైంది. అయితే ఆపార్టీ భిక్షంగౌడ్‌కు మద్దతిస్తుందా..? లేక ఆయనను పార్టీలో చేర్చుకొని పార్టీ అభ్యర్థిగా నిలబెడుతుందా...? అనే అంశంతో పాటు ఈయన కాకుండా వేరే అభ్యర్థిని బరిలో నిలుపుతుందా? అనే అంశం తేలాల్సి ఉంది. వీరితోపాటు ఇటీవలే అటవీశాఖలో జిల్లా అధికారిగా పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన యర్కాల శ్రీనివాస్ గౌడ్‌, ప్రభుత్వ అధికారిగా ఇంకా సర్వీస్‌ ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి ఎమ్మెల్సీగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.


వీరితోపాటుగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణసేన పార్టీ అభ్యర్థిగా వరంగల్‌ డాక్టర్‌ నలమాస శ్రీకాంత్‌గౌడ్‌ బరిలోకి వస్తున్నారు. ఈయనతోపాటుగా జనసేన అభ్యర్థిగా డాక్టర్‌ గడల శ్రీనివాసరావుతో పాటుగా మానవహక్కుల ఉద్యమనేత నలమాస కృష్ణ, రాష్ట్ర గిరిజనసంఘం నేత ధీరావత్‌ రవినాయక్‌ ఈ ఎన్నికల్లో పోటీకి ఆయా పార్టీలు, సంఘాల నుంచి సన్నాహాలు చేసుకుంటుండడంతో పోటీ రసవత్తరంగా మారే సూచనలు వెలువడుతున్నాయి.

hnk3.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ

న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 11:51 AM