Share News

భార్య కుట్ర తెలిసి షాక్.. ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళితే..

ABN , Publish Date - Nov 26 , 2026 | 11:20 AM

తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తన హత్యకు భార్య ఎంత పెద్ద కుట్ర పన్నిందో తెలిసి నిర్ఘాంతపోయారు.

భార్య కుట్ర తెలిసి షాక్.. ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి వెళితే..
UP Woman arrested for poisoning Husband

ఇంటర్నెట్ డెస్క్: తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తన హత్యకు భార్య ఎంత పెద్ద కుట్ర పన్నిందో తెలిసి ఆ వ్యక్తి నిర్ఘాంతపోయారు. యూపీలోని ఘాజియాబాద్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, వసుంధర ప్రాంతానికి చెందిన సుశీల్ కుమార్ భట్నాగర్‌కు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఆయన ఏటా రూ.5-6 కోట్ల వ్యాపారం చేస్తుంటారు. అంతేకాకుండా, ఆయన పేరు మీద రూ.2 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ పాలసీకి సుశీల్ భార్య రేణు భట్నాగర్ నామినీ. ఇదిలా ఉంటే, ఈ మధ్యకాలంలో సుశీల్ తరచూ అనారోగ్యం పాలయ్యేవారు. తన తనయుడు, మేనల్లుడిని కూడా ఇదే అనార్య లక్షణాలు వేధించసాగాయి.


ఈ క్రమంలో సుశీల్ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హానికారక లెడ్ ఖనిజం ఆయన శరీరంలో ఉన్నట్టు పరీక్షల్లో బయటపడింది. దీనికి వెనుక భార్య కుట్ర ఉందని అర్థం చేసుకున్న సుశీల్ సెప్టెంబర్ 24 పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు నవంబర్ 23న నిందితురాలిని అరెస్టు చేశారు.

విచారణ సందర్భంగా రేణు తను చేసిన నేరాన్ని ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. భర్త ఆస్తి, ఇన్సురెన్స్‌పై కన్నేసి దురాశతో ఈ కుట్రకు తెరతీసినట్టు స్వయంగా వెల్లడించిందని తెలిపారు. భర్తను అడ్డుతొలగించుకుంటే ఆ సంపదంతా తన సొంతమవుతుందని భావించినట్టు తెలిపింది. అయితే, ఈ కుట్రలో వేరెవరైనా పాలుపంచుకున్నారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా

డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించి రూ.12.20 లక్షలు స్వాహా

Updated Date - Nov 26 , 2026 | 11:36 AM