డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించి రూ.12.20 లక్షలు స్వాహా
ABN , Publish Date - Nov 26 , 2026 | 08:23 AM
ఓఎల్‌ఎక్స్‌లో సోఫా విక్రయానికి పెట్టిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.12.20 లక్షలు కోల్పోయింది.
హైదరాబాద్ సిటీ: ఓఎల్‌ఎక్స్‌లో సోఫా విక్రయానికి పెట్టిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.12.20 లక్షలు కోల్పోయింది. సైబర్‌క్రైం పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన మహిళ తమ ఇంట్లో ఉన్న సోఫాను విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టింది. తాము సోఫా కొంటామని ఆమెను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు ముందుగా నమ్మకం సంపాదించేందుకు కొంతమొత్తం డబ్బు ఆన్‌లైన్‌లో పంపారు. తర్వాత ఆన్‌లైన్ చెల్లింపుల్లో సమస్య వస్తోందని దీని ద్వారా డబ్బు పంపుతామని ఓ క్యూఆర్ కోడ్ పంపారు.
దాని నుంచి డబ్బు పంపితే.. నిమిషాల వ్యవధిలో రెట్టింపు రీఫండ్ వస్తుందని చెప్పారు. ఆ మహిళ కూడా ఆ కోడ్ నుంచి డబ్బు పంపించేలా మాటలతో మాయ చేశారు. బ్యాంకు వెరిఫికేషన్, రీఫండ్, ఇలా పలు దఫాలుగా రూ12.20 లక్షలు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు ఇంకా డబ్బు డిమాండ్ చేస్తుండడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మల్కాజిగిరి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News