Share News

ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:41 AM

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 26 జిల్లాల్లోని 3,240 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తుండగా.. మొత్తం 74.45 లక్షల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దీనితో పాటు 23 పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ రోజే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
ap panchayat elections

అమరావతి, నవంబరు 26: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో మొత్తం 3,240 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తుండగా.. 31, 614 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికల్లో 709 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం 74.45 లక్షల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.


23 పట్టణ స్థానిక సంస్థలకు కూడా నేడే పోలింగ్

పంచాయతీ ఎన్నికలతో పాటు నేడు రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి.. కార్పొరేషన్లతోపాటు 19 పురపాలక సంఘాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏపీ వ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 24,98,312 మంది ఓటర్లు ఉండగా.. 2,698 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


819 సమస్యాత్మక, 597 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 5,602 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్ల దగ్గర.. అదనంగా మరో 183 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ విధుల్లో 3,362 మంది ప్రిసైడింగ్, 3,531 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొంటున్నారు. వీరితోపాటు 12,831 మంది ఇతర పోలింగ్ సిబ్బంది, 302 మంది రిటర్నింగ్ అధికారులు, 378 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 142 మంది జోనల్ అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. కౌంటింగ్ కోసం 23 కేంద్రాలు, 115 కౌంటింగ్ హాళ్లు, 842 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కాగా.. లెక్కింపు ప్రక్రియకు 842 మంది సూపర్‌వైజర్లు, 2,526 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించినట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్‌

ప్రజాతీర్పును జగన్‌ అవమానిస్తున్నారు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 07:41 AM