Share News

అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:58 AM

ఈనాడు గ్రూపు సంస్థల పూర్వ ఛైర్మన్‌, దివంగత చెరుకూరి రామోజీరావు జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో...

అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్‌

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఈనాడు గ్రూపు సంస్థల పూర్వ ఛైర్మన్‌, దివంగత చెరుకూరి రామోజీరావు జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రకాశం జిల్లా, ఒంగోలుకు చెందిన నార్నే వెంకట సుబ్బయ్య ఈ పిల్‌ వేశారు. ప్రతీ ఏడాది నవంబర్‌ 16న రామోజీరావు జయంతిని అధికారిక కార్యక్రమంగా జరపాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 243ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ప్రస్తుత వ్యాజ్యంలో నిర్ణయం వెల్లడించే వరకు జీవో అమలును నిలుపుదల చేయాలని తన పిటిషన్‌లో కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 07:01 AM