ప్రజాతీర్పును జగన్ అవమానిస్తున్నారు: నీలాయపాలెం
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:54 AM
ఊరూపేరూ లేని చిన్న వెబ్‌సైట్ కథనాన్ని తీసుకొచ్చి 2024 ప్రజాతీర్పును జగన్ అగౌరవపరుస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు.
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఊరూపేరూ లేని చిన్న వెబ్‌సైట్ కథనాన్ని తీసుకొచ్చి 2024 ప్రజాతీర్పును జగన్ అగౌరవపరుస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం టీడీపీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో అమరావతిపై విష ప్రచారం చేయించిన మయాంక్ అగర్వాల్ పనిచేస్తున్న ఆ సంస్థే మరోసారి 2024 ఎన్నికలపై అసత్యాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మయాంక్ అగర్వాల్ ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ అనే సంస్థలో చేరి, మరో ఇద్దరిని తోడు చేసుకుని ఇలా అసత్య కథనాలు రిపోర్టులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల పోలింగ్‌పై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులు ఇంత వరకు కోర్టులకు ఎందుకు వెళ్లలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల తీరుపై అభ్యంతరాలు ఉంటే పోలింగ్, ఎన్నికల అనంతరం అధికారులు ఇచ్చిన ఫామ్ 17(సి) పార్ట్ 1, 2లపై ఆ పార్టీ ఏజెంట్లు ఎందుకు సంతకాలు పెట్టారని నిలదీశారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్