ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:35 AM
ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ జి.లక్ష్మీ శా తెలిపారు. ఉదయం 8:00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 8.32 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 26: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ జి.లక్ష్మీ శా తెలిపారు. ఉదయం 8:00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 8.32 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు. 5 మండలాల్లోని 72 గ్రామ పంచాయతీలు, 814 వార్డులకు పోలింగ్ జరుగుతోందని తెలిపారు. మొత్తం 3,11,318 మంది ఓటర్లకు గాను ఉదయం 8 గంటల వరకు 25,912 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
మండలాల వారీగా.. ఇబ్రహీంపట్నంలో 17.38 శాతం, మైలవరం 13.92 శాతం, జి.కొండూరు 9.99 శాతం పోలింగ్ నమోదైందన్నారు. అలాగే విజయవాడ రూరల్ మండలంలో 4.44 శాతం, రెడ్డిగూడెం మండలంలో 4.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం మండలంలో అత్యధికంగా 17.38 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఓటర్లందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ లక్ష్మీ శా విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు
కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Read Latest AP News And Telugu News