కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:27 AM
గుడివాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. టౌన్ హై స్కూల్ 1వ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పోలింగ్‌లో పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా, నవంబర్ 26: గుడివాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. టౌన్ హై స్కూల్ 1వ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పోలింగ్‌లో పాల్గొన్నారు. మాతృమూర్తి శాంతమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే మాతృమూర్తికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఓటేశారు. అనంతరం ఎస్‌డబ్ల్యూసీ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులతో పోలింగ్ సరళిపై రాము చర్చించారు.
ప్రజలకిది మంచి అవకాశం: రాము
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాము అన్నారు. ‘నేను ఓటింగ్‌లో పాల్గొని వచ్చాను. ప్రజలకిది మంచి అవకాశం. గుడివాడ అభివృద్ధికి దోహదపడే వారిని ఎన్నుకునే మంచి అవకాశం ఇది. ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుందో వారిని మద్దతుగా నిలబడండి. మంచి చేసే వారిని, చేయగలిగే వారిని మాత్రమే ఎన్నుకోమని నేను కోరుతున్నాను’ అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News