Share News

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ABN , Publish Date - Nov 26 , 2026 | 09:52 AM

అనంతపురం జిల్లాలోని యాడికి మండలం రాయలచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుపాన్ వాహనం ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
Road Accident

అనంతపురం, నవంబర్ 26: జిల్లాలోని యాడికి మండలం రాయలచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుపాన్ వాహనం ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి తాడిపత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు నందలపాడు, కావేటి సముద్రం గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్తున్న తుపాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై ఆరా తీశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై మంత్రి తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలు కావడంపై ఆవేదన చెందారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య చికిత్సపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి.. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైన వైద్య సదుపాయాలు తక్షణమే కల్పించాలని ఆదేశించారు.


రహదారి ప్రమాదాల నివారణకు రవాణా భద్రతా చర్యలు మరింత పటిష్ఠం చేయాలని మంత్రి సూచించారు. ప్రయాణాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘మనం తీసుకునే జాగ్రత్తలే నిండు ప్రాణానికి రక్షణగా ఉంటుంది’ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్‌

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 10:02 AM