వైభవంగా వైఎస్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం..
ABN , Publish Date - Nov 26 , 2026 | 08:28 AM
మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి-సోమల రఘురామిరెడ్డిల వివాహం నిన్న (బుధవారం) బెంగుళూరులోని నందిహిల్స్‌లోని ‘మనధీర’ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలీ రెడ్డి-రఘురామిరెడ్డిల వివాహం నిన్న వైభవంగా జరిగింది. బెంగుళురు సమీపంలోని నందిహిల్స్‌లో గల ‘మగధీర’ రిసార్ట్‌లో అత్యంత ఆత్మీయుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వివాహం క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం జరగ్గా.. ఈ రోజు (గురువారం) నందిహిల్స్‌లోని ఓ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రాజకీయ, వ్యాపారరంగాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. కాగా.. షర్మిల సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందనట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్